పెద్ద సారూ.. పార్టీ ఆఫీసులో ఇదేం పని.. వీడియో వైరల్‌ | BJP Notice To Gonda Chief Amar Kishore Kashyap Over His Viral Video With Woman In Party Office | Sakshi
Sakshi News home page

పెద్ద సారూ.. పార్టీ ఆఫీసులో ఇదేం పని.. వీడియో వైరల్‌

May 26 2025 7:24 AM | Updated on May 26 2025 10:01 AM

BJP Notice To Gonda chief Amar Kishore Kashyap Over His Viral Video

లక్నో: బీజేపీ సీనియర్‌ నేత ఒకరు పార్టీకి చెందిన మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మహిళా కార్యకర్తను రాత్రి వేళ పార్టీ కార్యాలయంలోకి తీసుకెళ్లడం ఆమెతో అనుచితంగా ప్రవర్తించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో సదరు నేత స్పందిస్తూ.. దీని వెనుక రాజకీయ కారణాలున్నాయని చెప్పడం గమనార్హం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. ఏప్రిల్‌ 12న రాత్రి 9.30 గంటల సమయంలో గోండా జిల్లా బీజీపీ అధ్యక్షుడు అమర్ కిషోర్ కశ్యప్, ఒక మహిళా కార్యకర్తతో కలిసి కారులో పార్టీ కార్యాలయానికి చేరుకున్నాడు. మెట్ల వద్ద ఆమెను కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత ఆ మహిళతో కలిసి పై అంతస్తులోని గదిలోకి వెళ్లాడు. బీజేపీ పార్టీ కార్యాలయంలోని సీసీటీవీలో ఇది రికార్డ్‌ అయ్యింది. దీంతో ఈ వీడియో క్లిప్‌ తాజాగా వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో బామ్ బామ్‌ మహిళా కార్యకర్తతో అసభ్యకరంగా ప్రవర్తించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

మరోవైపు ఈ వైరల్‌ వీడియోపై బీజేపీ నేత అమర్ కిషోర్ కశ్యప్ స్పందించారు. ఈ వీడియోలో ఉన్నది తానేనని ఒప్పుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను కొనసాగడం ఇష్టం లేని వ్యక్తులు పన్నిన కుట్ర ఇది. కొంతమంది నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఇది ఏప్రిల్ 12 తేదీన జరిగింది. ఆ రోజు మహిళా కార్యకర్త అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. దీంతో పార్టీ కార్యాలయంలో విశ్రాంతి తీసుకోవాలని సూచించాను. మానవతా దృక్పథంతో ఆ మహిళకు సహాయం చేశానని చెప్పుకొచ్చారు. అయితే, తనపై కుట్రతో ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ‘ఈ వీడియో వైరల్‌ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు. 

ఈ వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో అమర్ కిషోర్‌కు పార్టీ హైకమాండ్‌ నోటీసులు జారీ చేసింది. ఏడు రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. అనంతరం, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవింద్ నారాయణ్ శుక్లా స్పందిస్తూ..‘సోషల్ మీడియాలోని వీడియో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉంది. పార్టీ నేతలకు క్రమశిక్షణ అవసరం. ఈ ఘటనపై నోటీసులు ఇవ్వడం జరిగింది. అనుచితంగా ప్రవర్తించినట్టు తేలితే కఠినమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement