ఢిల్లీలో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు | Earthquake in Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

Apr 3 2026 10:23 PM | Updated on Apr 4 2026 9:04 AM

 Earthquake in Delhi

దేశ రాజధాని ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌లలో భూకంపం సంభవించింది. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ-NCR ప్రాంతంలో భూమి పెద్దఎత్తున కంపించింది. దీంతో పరిసరాల్లోని ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయిటకి పరుగులు తీశారు. రిక్టర్‌ స్కేలుపై భూంకపం తీవ్రత  5.9గా నమోదైంది.  దీని ప్రభావంతో ఉత్తర భారతదేశం అంతటా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.  కాగా ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం ఈ భూకంప తీవ్రత వల్ల ఎటువంటి ప్రాణ,ఆస్తి నష్టం సంభవించనట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement