రాహుల్ భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ | Sonia Gandhi To join Rahul Gandhi Bharat Jodo Yatra | Sakshi
Sakshi News home page

రాహుల్‌ భారత్ జోడో యాత్రలో సోనియా, ప్రియాంక

Oct 2 2022 9:37 PM | Updated on Nov 3 2022 2:51 PM

Sonia Gandhi To join Rahul Gandhi Bharat Jodo Yatra - Sakshi

రాహుల్‌తో పాటు యాత్రలో గురువారం పాల్గొంటారు. సోనియా కుమార్తె, రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ శుక్రవారం ఈ యాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

సాక్షి,న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం ఆమె సోమవారం కర్ణాటక చేరుకోనున్నారు. రాహుల్‌తో పాటు యాత్రలో గురువారం పాల్గొంటారు. సోనియా కుమార్తె, రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ శుక్రవారం ఈ యాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

రాహుల్ భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న మొదలు పెట్టినప్పుడు వైద్య పరీక్షల కోసం సోనియా విదేశాలకు వెళ్లారు. ఇప్పుడు మొదటిసారి రాహుల్ పాటు పాదయత్ర చేయనున్నారు.

కాంగ్రెస్‌కు పునరుత్తేజం తీసుకొచ్చేందుకు రాహుల్ గాంధీ ప్రతిష్ఠాత్మకంగా భారత్ జోడో యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. 12 రాష్ట్రాల మీదుగా 3,500 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది. దేశంలోని అన్ని మీడియా సంస్థలను బీజేపీ తన నియంత్రణలోకి తీసుకుందని, తమకు పాదయాత్ర తప్ప మరో మార్గం లేదని రాహుల్ శుక్రవారం తెలిపారు. బీజేపీ విభజన రాజకీయాన్ని ఎండగట్టి దేశంలోని అన్ని వర్గాల వారిని ఏకం చేసేందుకే ఈ యాత్ర చేపట్టినట్లు చెప్పారు.
చదవండి: మహారాష్ట్ర సీఎం ప్రాణాలకు ముప్పు.. భద్రత మరింత పటిష్ఠం

Advertisement
 
Advertisement
Advertisement