చంద్రబాబుకు నిధులిస్తే రాజధాని ఎందుకు కట్టలేదు | Somu Veerraju Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు నిధులిస్తే రాజధాని ఎందుకు కట్టలేదు

Sep 28 2022 4:09 AM | Updated on Sep 28 2022 4:09 AM

Somu Veerraju Fires On Chandrababu - Sakshi

గుంటూరు మెడికల్‌:  ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి రూ.6,500 కోట్లు కేంద్రం చంద్రబాబుకు ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. ఆ నిధులతో రాజధానిని ఎందుకు కట్టలేదని చంద్రబాబును ప్రశ్నించారు. రాజధాని కోసం రైతులు నేడు రోడ్డుపై పాదయాత్రలు చేస్తున్నారని రైతులను రోడ్డుపై ఎవరు నడిపిస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు.

మంగళవారం గుంటూరులో లాడ్జిసెంటర్‌లో ప్రజా పోరు వీధి సమావేశానికి సోము వీర్రాజు హాజరయ్యారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సింగపూర్, మలేసియా, జపాన్‌ అంటూ అన్ని దేశాలు తిరిగి ఏ దేశం వెళితే ఆ దేశ రాజధాని తరహాలో ఏపీకి రాజధాని నిర్మాణం చేస్తానని పలు మార్లు చెప్పారన్నారు. దేశాలు తిరిగి వేల కోట్లు ఖర్చు చేశారే తప్ప, రాజధాని కట్టలేదన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement