పసుపు, కుంకుమ పేరుతో కేంద్ర నిధుల దుర్వినియోగం 

Somu Veerraju Comments On TDP Govt Central funds Misuse - Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు 

నెల్లూరు(బారకాసు): గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం ఇచ్చిన నిధుల్లో పసుపు, కుంకుమ పేరుతో రూ.కోట్లు దుర్వినియోగం అయ్యా యని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన తప్పును ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేయకుండా కేంద్రం ఇస్తున్న నిధులను సద్వినియోగపరచుకోవాలన్నారు.

సముద్రతీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం 60 శాతం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, అయితే రాష్ట్రప్రభుత్వం 40 శాతం నిధులు కేటాయించాల్సి ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో తాము చేపట్టిన  ప్రజాపోరు బస్సు యాత్ర కొనసాగుతుందని చెప్పారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో జనసేనతోనే తమ పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top