ఉద్యోగాలను అమ్ముకున్న చంద్రబాబు | Somu Veerraju Comments On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలను అమ్ముకున్న చంద్రబాబు

Mar 18 2021 4:40 AM | Updated on Mar 18 2021 4:40 AM

Somu Veerraju Comments On Chandrababu Naidu - Sakshi

మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

నెల్లూరు (బారకాసు): కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన విద్యుత్‌ సబ్‌స్టేషన్లకు అవసరమైన ఉద్యోగాలను నాలుగైదు లక్షల చొప్పున చంద్రబాబు అమ్ముకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. నెల్లూరు నగరంలో బుధవారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని 2014లో ప్రజలు చంద్రబాబుకు పట్టంగడితే ఆయనేమో రూలింగ్‌ చేయకుండా ట్రేడింగ్‌ చేశారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని ఎదుర్కోలేక టీడీపీ తోక ముడిచిందన్నారు. దేశాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ పాలన అందిస్తున్నారని చెప్పారు. అనంతరం ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌లుగా, వార్డు సభ్యులుగా గెలుపొందిన బీజేపీ మద్దతుదారులను వీర్రాజు సన్మానించారు.   

Advertisement
 
Advertisement
Advertisement