చంద్రబాబుకు షాక్‌ మీద షాకులు | Senior Tdp Leader Rayapati Ranga Rao Resigns | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు షాక్‌ మీద షాకులు.. రాయపాటి రంగారావు రాజీనామా

Jan 12 2024 4:54 PM | Updated on Feb 4 2024 1:32 PM

Senior Tdp Leader Rayapati Ranga Rao Resigns - Sakshi

ఎన్నికల వేళ చంద్రబాబుకు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి.

సాక్షి, గుంటూరు: ఎన్నికల వేళ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. టీడీపీకి రాయపాటి రంగారావు రాజీనామా చేశారు. టీడీపీ సీనియర్‌ నేతలు ఒక్కొక్కరిగా ఆ పార్టీని వీడుతున్నారు. విజయవాడ, గుంటూరులలో కేశినేని, రాయపాటి కుటుంబాలు టీడీపీకి అండగా నిలుస్తూ వచ్చాయి. చంద్రబాబు విధానాలు నచ్చక ఆ నేతలు సైకిల్ దిగారు.

మొన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి గుడ్ బై చెప్పగా, నేడు రాయపాటి రంగారావు రాంరాం చెప్పారు. అదే బాటలో మరికొందరు సీనియర్ నేతలు నడవనున్నట్లు సమాచారం. సొంత సామాజిక వర్గం నుండి తగులుతున్న షాకులతో టీడీపీ కుదేలవుతుంది. ఎన్నికల సమయంలో ఇది పార్టీకి కోలుకోలేని దెబ్బ అని క్యాడర్‌ అంటోంది.

చంద్రబాబుకు బ్యాడ్‌ టైం
షాక్‌ నుంచి కోలుకోకముందే చంద్రబాబుకు మరో షాక్‌ తగిలింది. టీడీపీకి మరో నేత లింగమనేని శివరామ ప్రసాద్‌ రాజీనామా చేశారు. టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి అందులో ఉన్న లింగమనేని.. ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ద్వారా ప్రకటించారు. ఈయన ద్వారానే ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు పలు పిటిషన్లు వేయించారు.

Advertisement
 
Advertisement
Advertisement