Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu Naidu And Yellow Media - Sakshi
Sakshi News home page

టీడీపీ, ఎల్లో మీడియా స్కెచ్‌ అదే..: సజ్జల రామకృష్ణారెడ్డి

Dec 14 2022 3:56 PM | Updated on Dec 14 2022 7:03 PM

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీకి పెట్టుబడులు వస్తుంటే కొందరు ఓర్వ లేకపోతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇండస్ట్రీలకు వేగంగా అనుమతులు ఇస్తున్నామని, ప్రభుత్వం నిబంధనల ప్రకారమే అనుమతులు ఇస్తోందని స్పష్టం చేశారు.

‘‘రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే విషం కక్కుతున్నారు. ఏ పెట్టుబడి వచ్చినా సీఎం జగన్‌కు బంధువులని ప్రచారం చేస్తున్నారు. ఏపీకి పెట్టుబడులు రాకూడదన్నదే ఎల్లో మీడియా తాపత్రయం. బరితెగించి తప్పుడు రాతలు రాస్తున్నారు. గత ప్రభుత్వం పద్దతి లేకుండా అనుమతులు ఇచ్చింది’’ అని సజ్జల దుయ్యబట్టారు.

‘‘అడ్డగోలుగా మాట్లాడటం చంద్రబాబుకు అలవాటుగా మారింది. ఏపీకి  ఆదాయం రాకూడదనేదే టీడీపీ, ఎల్లో మీడియా లక్ష్యం. గత ప్రభుత్వం చేసిన అప్పులకు మమ్మల్ని బాధ్యుల్ని చేస్తున్నారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.
చదవండి: అటవీశాఖ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష.. కీలక ఆదేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement