జానారెడ్డి సహా పలువురి నామినేషన్ల తిరస్కరణ | Rejection Of Nominations In Telangana | Sakshi
Sakshi News home page

జానారెడ్డి సహా పలువురి నామినేషన్ల తిరస్కరణ

Published Mon, Nov 13 2023 7:05 PM | Last Updated on Mon, Nov 13 2023 8:31 PM

Rejection Of Nominations In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. నల్లగొండ నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి దాఖలు చేసిన నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కాగా.. వాటిలో చాలావరకు నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు తెలుస్తోంది. 

నాగార్జున సాగర్‌ బరిలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా కాంగ్రెస్‌ నేత జానారెడ్డి తనయుడు జైవీర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే జానారెడ్డి నామమాత్రంగా నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ తెలంగాణలో ఎన్నికల నామినేషన్ల పరిశీలన జరగ్గా.. జానారెడ్డి దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీనితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడలో 2 నామినేషన్ల తిరస్కరణకు గురయ్యాయి. అటు కరీంనగర్‌ మానకొండూరులోనూ ఏడుగురి నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి 21మంది అభ్యర్థులు నామినేషన్ లు దాఖలు చేయగా.. 18మంది అభ్యర్థుల నామినేషన్ లు ఆమోదం పొందాయి. సరైన పత్రాలు లేకపోవడంతో ముగ్గురి నామినేషన్‌లను అధికారులు తిరస్కరించారు. 

మహబూబాబాద్ జిల్లా:

  • మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి 22 నామినేషన్లు దాఖలు కాగా 7 నామినేషన్లు తిరస్కరణ
  • బరిలో 15 మంది అభ్యర్థులు

కామారెడ్డి జిల్లా

  • మొత్తం 19 మందికి గాను పరిశీలనలో 2 పోగా  17 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 
  • జుక్కల్ ఎన్నికల బరిలో 23 మంది అభ్యర్థులు.
  • పరిశీలనలో  5 గురు అభ్యర్థుల నామినేషన్ రిజెక్ట్ చేసిన అధికారులు.
  • 28 నామినేషన్లకు గాను 23 మంది నామినేషన్లు ఆమోదించిన రిటర్నింగ్ అధికారి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:

  • ఇల్లందులలో 34 మంది అభ్యర్థుల నామినేషన్లు దాఖలు
  • పరిశీలనలో నలుగురు అభ్యర్థుల తొలగింపు

ఖమ్మం జిల్లా:

  • పాలేరు నియోజకవర్గం నుంచి దాఖలైన నామినేషన్ లు 58
  • రిజెక్ట్ చేసినవి ఐదు
  • ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు 53 మంది అభ్యర్థులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

  • పినపాక నియోజకవర్గంలో మొత్తం దాఖలైన 25 మంది అభ్యర్థులు నామినేష్లను
  • ముగ్గురు అభ్యర్థుల నామినేష్లను తిరస్కరించిన అధికారులు 
  • బరిలో 23మంది అభ్యర్థులు

ఖమ్మం జిల్లా:

  • సత్తుపల్లి నియోజకవర్గంలో మొత్తం 41నామినేషన్లు దాఖలు
  • తిరస్కరణకు గురైన 6 నామినేషన్‌లు
  • పోటీలో 25 మంది అభ్యర్థులు

సూర్యాపేట జిల్లా :

  • సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గానికి 42 మంది అభ్యర్థులు 81 నామినేషన్లు దాఖలు 
  • నామినేషన్ల పరిశీలనలో భాగంగా 10 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ

జోగులాంబ గద్వాల జిల్లా:

  • గద్వాల అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా దరఖాస్తు చేసిన నామినేషన్లలో 20 దరఖాస్తులకు ఆమోదం, 
  • 5 నామినేషన్ లు సరైన డాక్యుమెంట్ లేని కారణంగా తిరస్కరించిన జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి 

నిర్మల్ నియోజకవర్గం:

  • మూడు నామినేషన్లు తిరస్కరించిన రిటర్నింగ్ అధికారి 
  • ఎన్నికల బరిలో  పదేహేను మంది  అభ్యర్థులు

నారాయణపేట జిల్లా

  • మక్తల్ లో  మొత్తం 15 నామినేషన్లలో   మూడు నామినేషన్లు తిరస్కరణ.
  • నామినేషన్ల పరిశీలనలో BSP అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ
  • రాష్ట్ర వ్యాప్తంగా 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో BSP అభ్యర్థుల తిరస్కరణ
  • స్టేషన్ ఘనపూర్, ఆలేరు, పాలకుర్తి, మధిర, భువనగిరి, బహదూర్ పుర, జనగామ సెగ్మెంట్ల అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరించిన RO లు

ఆదిజలాబాద్ జిల్లా:

  • ఖానాపూర్ నియోజకవర్గంలో నామినేషన్లు దాఖలు చేసిన 17 మంది 
  • వివిధ కారణాలతో  4 గురు రిజెక్ట్ 
  • బరిలో మొత్తం 13 మంది అభ్యర్థులు

కరీంనగర్ జిల్లా:

  • చొప్పదండి నియోజకవర్గంలో 18మంది అభ్యర్థుల నామినేషన్లు దాఖలు..
  • లింగాల లచ్చయ్య అనే స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ తిరస్కరించిన ఎన్నికల అధికారులు.

పెద్దపల్లి జిల్లా:

  • మంథని అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్లు దాఖలు చేసిన 28 మంది అభ్యర్థులు..
  • నలుగురి నామినేషన్ల తిరస్కరణ.

కరీంనగర్ జిల్లా:

  • కరీంనగర్ అసెంబ్లీలో ఏడుగురి నామినేషన్ల తిరస్కరణ..
  • 31 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం.
  • హుజూరాబాద్ అసెంబ్లీలో ఏడుగురి నామినేషన్ల తిరస్కరణ..
  • 13 మంది అభ్యర్థుల నామినేషన్ల ఆమోదం.

పెద్దపల్లి జిల్లా:

  • పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పూర్తయిన నామినేషన్ల పరిశీలన ప్రక్రయ.
  • మొత్తం దాఖలైన నామినేషన్లు 30.
  • తిరస్కరణకు గురైన నామినేషన్లు 5.
  • పోటీలో నిలిచిన అభ్యర్థులు 25 మంది.

కామారెడ్డి జిల్లా 

  • ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి 16 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా ఇద్దరి నామినేషన్లను తిరస్కరించిన ఎన్నికల అధికారులు 

కామారెడ్డి జిల్లా:

  • కామారెడ్డి నియోజక వర్గంలో ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు.
  • 6 గురు అభ్యర్థుల నామినేషన్ రిజెక్ట్ చేసిన అధికారులు.
  • 64 నామినేషన్లకు గాను 58 మంది నామినేషన్లు ఆమోదించిన రిటర్నింగ్ అధికారి.

వరంగల్:

  • వర్ధననపేట నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి 26 మంది 40సేట్ల నామినేషన్ దాఖలు
  • 6 నామినేషన్ల తిరస్కరణ..
  • 20 మంది నామినేషన్లు అమోదం తెలిపిన ఎన్నికల ఆధికారి...
  • వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 38 మంది అభ్యర్థులు 51 సెట్లు నామినేషన్ దాఖలు 
  •  31 నామినేషన్లను ఆమోదించగా.. ఆరు నామినేషన్లు తిరస్కరణ

జనగామ జిల్లా:

  • జనగామ అసెంబ్లీ నియోజకవర్గానికి  32 నామినేషన్లు దాఖలు 
  • 5 నామినేషన్ల తిరస్కరణ
  • బరిలో 27 మంది అభ్యర్థులు.
  • స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో మొత్తం 28 మంది అభ్యర్థులలో  5 మంది అభ్యర్థుల నామినేషన్ తిరస్కరించిన  ఎన్నికల అధికారి 
  • స్టేషన్ ఘనపూర్ లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా జానకిపురం సర్పంచ్ నవ్య నామినేషన్ ఆమోదించిన ఎన్నికల అధికారి.

ములుగు జిల్లా

  • ములుగు నియోజకవర్గంలో మొత్తం 18 మంది 28  సెట్లను  నామినేషన్ దాఖలు చేయగా ఇద్దరు అభ్యర్థుల నామినేషన్ తిరస్కరించిన ఎన్నికల అధికారి

వరంగల్ జిల్లా:

  • ముగిసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ.
  • ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం.
  • వరంగల్ తూర్పులో 31 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం.
  • పరకాలలో 36 మంది నామినేషన్లకు ఆమోదం.
  • వర్ధన్నపేటలో 20 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం.
  • నర్సంపేటలో 19 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం.
  • జనగామలో 27 మంది అభ్యర్థులకు ఆమోదం.
  • పాలకుర్తిలో 22 మంది నామినేషన్లకు ఆమోదం.
  • స్టేషన్ ఘనపూర్ లో 23 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం.
  • ములుగులో 16 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం.
  • భూపాలపల్లిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం.
  • మహబూబాబాద్ లో 15 మంది నామినేషన్లకు ఆమోదం.
  • డోర్నకల్ నుండి 17 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం.
  • వరంగల్ పశ్చిమలో 20మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం.

ఇదీ చదవండి: రేవంత్‌పై తెలంగాణ సీఈవోకు ఫిర్యాదు.. బీఆర్‌ఎస్‌ వ్యతిరేక యాడ్స్‌పై కాంగ్రెస్‌ రియాక్షన్‌ ఇది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement