
సాక్షి, పులివెందుల: టీడీపీ నేతలు పులివెందులలో ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలిచేందుకు టీడీపీ అనేక కుట్రలు చేస్తోందన్నారు. పోలీసులు టీడీపీ అరాచకాలకు వంత పాడుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు.
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలిచేందుకు టీడీపీ అనేక కుట్రలు చేస్తోంది. అధికారం అండతో టీడీపీ అధికారులను విచ్చలవిడిగా వాడుకుంటుంది. పులివెందులలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలుసు. వైఎస్సార్ పేరుకు పులివెందులలో ఓటమి లేదు. పోలీసులు టీడీపీ అరాచకాలకు వంత పాడుతున్నారు. సాక్షి మీడియా సిబ్బందిపై దాడి చేసేందుకు టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు. సాక్షి సిబ్బంది వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులు’ అని చెప్పుకొచ్చారు.
