ఇండియా-భారత్ పేరు మార్పుపై ప్రధాని మోదీ ఏం చెప్పారంటే..? | Sakshi
Sakshi News home page

ఇండియా-భారత్ పేరు మార్పుపై ప్రధాని మోదీ ఏం చెప్పారంటే..?

Published Thu, Sep 7 2023 5:54 PM

PM Modi Message To Ministers On Bharat India Row - Sakshi

ఢిల్లీ: భారత్- ఇండియా పేరు మార్పు వివాదానికి దూరంగా ఉండాలని మంత్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. జీ20తో సహా పలు అంశాలపై జరిపిన చర్చలో ప్రధాని మోదీ.. ఈ మేరకు కేంద్ర మంత్రులకు సూచనలు ఇచ్చారు. దేశం పేరు మార్పు అంశంపై ఎలాంటి కామెంట్ చేయకూడదని చెప్పారట. గత రెండు రోజులుగా పేరుమార్పుపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతుండగా.. ప్రధాని మోదీ మాట్లాడటం ఇదే మొదటిసారని విశ్వసనీయ వర్గాల సమాచారం. 

జమిలీ ఎన్నికలు, ఇండియా-భారత్ పేరు మార్పు, ఈ నెల 18వ తేదీ నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు బీజేపీ గేమ్‌ ప్లాన్‌లో భాగంగా ప్రతిపక్షాలు భావించాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండాను పేర్కొనాలని కాంగ్రెస్ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రధానంగా తొమ్మిది అంశాలను పేర్కొంటూ వాటిపై చర్చలు జరపాలని కోరారు. 

దీనిపై స్పందించిన అధికార పార్టీ.. సమావేశాల ముందు అజెండాను తెలపడం సాంప్రదాయానికి విరుద్ధమని చెప్పారు. సభకు  అన్ని పార్టీలకు ఆహ్వానం ఉంటుంది. ప్రజల సమస్యలను అక్కడే చర్చించుకోవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. 

జీ20 డిన్నర్ మీటింగ్‌కి పంపిన ఆహ్వాన ప్రకటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రెసిడెంట్‌ ఆఫ్ భారత్‌ అని పేర్కొనడంతో విపక్షాలు ఒక్కసారిగా విమర్శలను ఎక్కుపెట్టాయి. సాంప్రదాయం ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని పేర్కొంటామని, దేశం పేరును మార్చబోతున్నారని ఆరోపణలు ప్రారంభం అయ్యాయి. దేశంలో అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని సూచించాయి. 

ఇదీ చదవండి: జమిలి ఎన్నికలు.. కేంద్ర నిర్ణయాన్ని సమర్థించిన మాజీ ఉప రాష్ట్రపతి

Advertisement
 
Advertisement