
ఫైల్ ఫొటో
Rajasthan Elections: క్రికెట్‌కు ముడిపెడుతూ రాజస్థాన్ కాంగ్రెస్ నాయకులపై ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర విమర్శలు చేశారు. రాజస్థాన్ కాంగ్రెస్.. తమను తామే రనౌట్ చేసుకునే క్రికెట్ జట్టు లాంటిదని, తమ బ్యాట్స్‌మెన్ ఒకరినొకరు రనౌట్ చేసుకోవడానికి ఐదేళ్లు ప్రయత్నించారని మోదీ ఎద్దేవా చేశారు.
రాజస్థాన్ చురు జిల్లా తారానగర్‌లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెట్టాలంటే నవంబర్ 25న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు.
కాంగ్రెస్ పార్టీ, అభివృద్ధి అనేవి పరస్పర శత్రవులని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ పార్టీకి మంచి ఉద్దేశాలు ఉండవని, వాటి మధ్య ఉన్న సంబంధం వెలుగు, చీకటి మధ్య ఉన్న సంబంధం లాంటిదన్నారు. వన్ ర్యాంక్, వన్ పెన్షన్ విషయంలో కాంగ్రెస్ మాజీ సైనికులను దశాబ్దాలుగా తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ దుష్పరిపాలన కారణంగా రాజస్థాన్‌లో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అదుపుతప్పాయని విమర్శించారు.
ఇదీ చదవండి: వరల్డ్‌కప్ ఫైనల్‌పై శివసేన ఎంపీ తీవ్ర విమర్శలు