
రైతులను ఏమాత్రం పట్టించుకోని కూటమి ప్రభుత్వం.. వాళ్లను పరామర్శించడానికి వెళ్తున్న వైఎస్ జగన్‌ను మాత్రం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మండిపడ్డారు. బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
సాక్షి, గుంటూరు: రైతుల కష్టాలను పట్టించుకోని కూటమి ప్రభుత్వం.. వాళ్లను పరామర్శించడానికి వెళ్తున్న వైఎస్ జగన్‌ను మాత్రం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మండిపడ్డారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
కూటమి సర్కార్ రైతులను పట్టించుకోవడం లేదు. మామిడి, పొగాకు, మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లేదు. రైతులు నిలదీస్తున్నా ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా?. దళారులు, మిల్లర్లు రైతులను దోచుకుంటుంటే మంత్రి ఏం చేస్తున్నారు?. మిర్చి రైతుల కోసం కేంద్రంతో ఒక్కసారైన మాట్లాడారా?. ఒక్క ఎమ్మెల్యే అయినా రైతుల్ని పరామర్శించారా?. జగన్ వెళ్తుటే మాత్రం అడ్డుకుంటున్నారు..
.. వైస్ జగన్ పరామర్శకు వెళ్తే అడ్డంకులు సృష్టిస్తారా?. పొగాకు రైతులతో మాట్లాడడానికి వెళ్తే రాళ్లతో దాడి చేయిస్తారా?. బంగారుపాళ్యం మార్కెట్‌కు 100 మీటర్ల దూరంలో హెలీప్యాడ్‌కు పర్మిషన్ ఇచ్చారా?. ఎల్లో మీడియాలో వైఎస్ జగన్‌పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. కొంతమందికి కూలీ ఇచ్చి జగన్‌ను తిట్టిస్తున్నారు..

.. మామిడి కొనుగోలు విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి, అధికారులు తలో మాట చెబుతున్నారు. ఏది నిజం? అసలు మామిడి కొనుగోళ్లకు సంబంధించిన రూ. 260 కోట్లకు జీవో వచ్చిందా?. రైతులను చంద్రబాబు ప్రభుత్వం దగా చేసింది అని పేర్ని నాని కూటమి సర్కార్‌పై మండిపడ్డారు.