చంద్రబాబు చరిత్ర హీనుడు: ఎంపీ తలారి రంగయ్య

Peddireddy Ramachandra Reddy Slams On Chandrababu Over Expel Of MPTC And ZPTC Elections - Sakshi

సాక్షి, నెల్లూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీరు ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన శనివారం తిరుపతి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా  ఓజిలి మండలంలో నిర్వహించన వైఎస్సార్‌సీపీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్లు రావని తెలిసే చంద్రబాబు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బహిష్కరణ డ్రామా ఆడుతున్నాడని మండిపడ్డారు. నామినేషన్లు, ఉపసంహరణ అయిపోయి, పోలింగ్‌కు 5 రోజులు ఉండగా బహిష్కరణ ఏంటి అని సూటిగా ప్రశ్నించారు. బహిష్కరణ అంటూనే వారికి బలం ఉన్న చోట్ల డబ్బులు పంచుతున్నారని దుయ్యబట్టారు. మొదటి నుంచీ చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతమే అని ఎద్దేవా చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుస్తామని తెలిపారు. 

అనంతపురం: చంద్రబాబు చరిత్ర హీనుడు అని  ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ ఎన్నికలను బహిష్కరించలేదని ఎంపీ తలారి రంగయ్య మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం ఏమైంది అని ప్రశ్నించారు.  ఓటమి గ్రహించే చంద్రబాబు ఎన్నికలను బహిష్కరించారని అన్నారు. చంద్రబాబు కుంటిసాకులు చెప్పడం హాస్యాస్పదం అని మండిపడ్డారు. సీఎం జగన్ అద్భుత పాలన ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయని తెలిపారు. ఏ ఎన్నిక జరిగినా వైఎస్సార్‌సీపీదే విజయం అని ఎంపీ తలారి రంగయ్య ధీమా వ్యక్తం చేశారు.
చదవండి: ఓటమి భయంతోనే పలాయనం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top