breaking news
tirupati byelection
-
‘డిపాజిట్లు రావని తెలిసే బాబు బహిష్కరణ డ్రామా’
సాక్షి, నెల్లూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీరు ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన శనివారం తిరుపతి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓజిలి మండలంలో నిర్వహించన వైఎస్సార్సీపీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్లు రావని తెలిసే చంద్రబాబు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బహిష్కరణ డ్రామా ఆడుతున్నాడని మండిపడ్డారు. నామినేషన్లు, ఉపసంహరణ అయిపోయి, పోలింగ్‌కు 5 రోజులు ఉండగా బహిష్కరణ ఏంటి అని సూటిగా ప్రశ్నించారు. బహిష్కరణ అంటూనే వారికి బలం ఉన్న చోట్ల డబ్బులు పంచుతున్నారని దుయ్యబట్టారు. మొదటి నుంచీ చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతమే అని ఎద్దేవా చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుస్తామని తెలిపారు. అనంతపురం: చంద్రబాబు చరిత్ర హీనుడు అని ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ ఎన్నికలను బహిష్కరించలేదని ఎంపీ తలారి రంగయ్య మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం ఏమైంది అని ప్రశ్నించారు. ఓటమి గ్రహించే చంద్రబాబు ఎన్నికలను బహిష్కరించారని అన్నారు. చంద్రబాబు కుంటిసాకులు చెప్పడం హాస్యాస్పదం అని మండిపడ్డారు. సీఎం జగన్ అద్భుత పాలన ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయని తెలిపారు. ఏ ఎన్నిక జరిగినా వైఎస్సార్సీపీదే విజయం అని ఎంపీ తలారి రంగయ్య ధీమా వ్యక్తం చేశారు. చదవండి: ఓటమి భయంతోనే పలాయనం -
నీ ఓటు ఎవరో వేసేశారమ్మా...!
తిరుపతి(రూరల్): తిరుపతి శాసనసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక పోలింగ్‌లో తన ఓటు హక్కు వినియోగించుకోవాలని పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓ మహిళ... అధికారులు చెప్పిన విషయాన్ని విని అవాక్కయింది. గాయత్రీ నగర్‌కు చెందిన శోభ(30) శుక్రవారం మధ్యాహ్నం స్థానికంగా 255వ నంబర్ పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. పోలింగ్ కేంద్రంలోని అధికారులకు గుర్తింపు కార్డు చూపగా... జాబితాను పరిశీలించి మీ ఓటు ఇప్పటికే వేసేశారు అంటూ బదులిచ్చారు. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే ఆందోళనకు దిగారు. తన ఓటు ఇంకొకరు ఎలా వేస్తారంటూ పోలింగ్ అధికారులను ఆమె నిలదీశారు. ఆమెకు మద్దతుగా మరికొందరు కూడా ఆందోళనలో పాల్గొన్నారు.