నీ ఓటు ఎవరో వేసేశారమ్మా...! | an woman looses her vote in tirupati bielection | Sakshi
Sakshi News home page

నీ ఓటు ఎవరో వేసేశారమ్మా...!

Feb 13 2015 5:54 PM | Updated on Sep 17 2018 6:08 PM

తిరుపతి శాసనసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక పోలింగ్‌లో తన ఓటు హక్కు వినియోగించుకోవాలని పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓ మహిళ... అధికారులు చెప్పిన విషయాన్ని విని అవాక్కయింది.

తిరుపతి(రూరల్): తిరుపతి శాసనసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక పోలింగ్‌లో తన ఓటు హక్కు వినియోగించుకోవాలని పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓ మహిళ... అధికారులు చెప్పిన విషయాన్ని విని అవాక్కయింది. గాయత్రీ నగర్‌కు చెందిన శోభ(30) శుక్రవారం మధ్యాహ్నం స్థానికంగా 255వ నంబర్ పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. పోలింగ్ కేంద్రంలోని అధికారులకు గుర్తింపు కార్డు చూపగా... జాబితాను పరిశీలించి మీ ఓటు ఇప్పటికే వేసేశారు అంటూ బదులిచ్చారు. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే ఆందోళనకు దిగారు. తన ఓటు ఇంకొకరు ఎలా వేస్తారంటూ పోలింగ్ అధికారులను ఆమె నిలదీశారు. ఆమెకు మద్దతుగా మరికొందరు కూడా ఆందోళనలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement