ఏంటి లోకేశా ఇదీ?.. నరాలు కట్‌ అయిపోతున్నాయ్‌..!

Nara Lokesh Funny Speech Tongue Slip Words Viral In Social Media - Sakshi

పాదయాత్రలో లోకేష్‌ చేస్తోన్న వ్యాఖ్యలు.. చర్చనీయాంశంగా మారుతున్నాయి. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ చంద్రబాబు ట్రైనింగ్‌ ఇదేనా అంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తనపై ఉన్న ముద్రను మార్చుకోవడానికి తరచుగా నేను మూర్ఖుడినంటూ చెప్పుకోవడం కూడా ద్వారా లోకేష్‌ ఏం ఆశిస్తున్నాడో కానీ.. జనం మాత్రం అది నిజమేమో అన్నట్టుగా ఉన్నారు. తరచుగా ఆయన చేస్తున్న ప్రకటనలు కూడా దీనికి ఆజ్యం పోస్తున్నాయి. 

లోకేష్‌ చెప్పిందేమిటి.. చెప్పాలనుకున్నదేమిటి?.. ప్రశాంతతను.. ప్రశాంతి అత్త అని,  జీవో నెంబర్‌ 1ని.. జియో 1,  పనిముట్లను పంది ముట్లు , అద్దెని అద్దు అంటూ పలకడంపై సోషల్‌ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఇవి కొన్ని మచ‌్చుకు ఉదాహరణలు మాత్రమే. ఇక బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి సైకిల్ పోవాలి అంటూ ఆయన చేసిన కామెంట్‌ సంచలనం సృష్టించింది. గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేసి లోకేష్‌ నవ్వులపాలయ్యారు.

లోకేష్‌ తన పొలిటికల్‌ కెరీర్‌లో చేసిన చిత్ర, విచిత్ర ప్రకటనలు:
కుల పిచ్చి, మ‌త పిచ్చి, అవినీతి, బంధుప్రీతి క‌ల పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీనే.
సైకిల్ కి ఓటేస్తే ఉరేసుకున్నట్టే.. 
వర్ధంతి సందర్బంగా మీ అందరికీ శుభాకాంక్షలు 
NTR ఆశయాలు  నాశనం చేయడానికే మీ ముందుకు వచ్చా
మీ ఉత్సాహం చూస్తుంటే అమెరికాలో కూడా  TDP అధికారంలోకి వ‌స్తామ‌నిపిస్తుంది.
ఊ  ఆ అంటే దెంగూ (డెంగ్యూ )వస్తుంది 
12  ఏళ్ల వచ్చేవరకు మా నాన్నను చూడలేదు 
కనీసం 12  కేసులుంటేనే నా దగ్గరకి రండి 
బందర్ పోర్టును కేసీఆర్ ఎత్తుకుపోతాడు 
 1 GB నెట్ వాడితే  1 శాతం జీడీపీ పెరుగుద్ది 
ఇసుక కొరత వలన స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు.

ఇలాంటి తప్పులు, వ్యాఖ్యలు చేయకూడదన్న ఉద్దేశ్యంతో పాదయాత్రకు ముందు లోకేష్‌కు భారీగా ట్రైనింగ్‌ ఇచ్చారని తెలుగుదేశం తమ్ముళ్లు చెప్పుకుంటారు. మదీనాగూడ ఫాంహౌస్‌లో తెలుగు భాషలో నిష్ణాతులైన ఐదుగురితో పాటు వివిధ అంశాల్లో దిట్ట అనిపించుకున్న వారితో లోకేష్‌కు శిక్షణ ఇచ్చారట. ఇంత చేసినా.. గ్రౌండ్‌లోకి లోకేష్‌ వచ్చి మాట్లాడినప్పుడు ఆ నైపుణ్యం ఏదీ రాకపోగా.. దానికి విరుద్ధమైన, నవ్వులపాలయ్యే ప్రకటనలు వస్తున్నాయి.
చదవండి: లోకేష్‌పై కొడాలి నాని ఫైర్‌.. ఎమ్మెల్యేగా ఓడిపోయినోడితో.. 

ఇక ఇటీవల పాదయాత్రలో మరో అడుగు ముందుకేసి 1994కు ముందు హైదరాబాద్ అంటే ఎవరికీ తెలియదన్నారు లోకేష్‌. దానిపై నెటిజన్లు మండిపడుతున్నారు. లోకేష్‌ పాదయాత్ర ఏ లక్ష్యం సాధిస్తుందో తెలియదు కానీ.. కోటలు దాటే  ఆయన మాటలు మిస్‌ఫైర్‌ అయి సొంత పార్టీనే దెబ్బతీసేలా ఉన్నాయని పార్టీలో తెలుగు తమ్ముళ్లు అనుకుంటున్నారు. ఇప్పటికే పాతాళానికి చేరిన పార్టీ ప్రతిష్టను మరింత లోతుకు తీసుకువెళ్తారా అని ఆందోళన చెందుతున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top