‘అది వదంతి మాత్రమే.. ఆ వార్తలను నమ్మకండి’

Nallamothu Bhaskar Rao Condemns IT Raids - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/నల్లగొండ: తన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయనే వార్తలను మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ఖండించారు.  ఆ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని, ఆ ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.  ఎక్కడో వ్యాపారస్తుల మీద రైడ్‌ జరిగితే తనకేంటి సంబంధమని ప్రశ్నించారు. 

నా బంధువులపై, నా కుమారుల ఇంట్లో సోదాలు జరగట్లేదు.నాపైన ఐటీ సోదాలు జరిగితే నేనెందుకు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాను. నాకు పవర్ ప్లాంట్స్‌ ఉన్నాయి  ఐటీ దాడులు అన్నది వదంతి మాత్రమే .నాపైన ఐటీ సోదాలు జరుగుతున్నాయన్న ప్రచారాన్ని నమ్మకండి. నేను ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాను’ అని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top