‘ధర్నాల పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాలు’ | MLA Vallabhaneni Vamsi Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

‘ధర్నాల పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాలు’

Nov 10 2021 3:27 PM | Updated on Nov 10 2021 3:44 PM

MLA Vallabhaneni Vamsi Fires On Chandrababu - Sakshi

చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ధర్నాల పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాలు ఆడుతున్నారని నిప్పులు చెరిగారు.

సాక్షి, విజయవాడ: చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ధర్నాల పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాలు ఆడుతున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు కొంగ జపాలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసినా బద్వేల్‌లో డిపాజిట్‌ కూడా రాలేదని ఎమ్మెల్యే వంశీ ఎద్దేవా చేశారు.

చదవండి: ‘చంద్రబాబు అంటేనే గూండాగిరి రాజకీయాలకు పెట్టింది పేరు’

‘‘కేంద్రాన్ని నిలదీసే దమ్ము.. ధైర్యం చంద్రబాబుకు లేదు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ధర్నాలు చేయాలంటూ చంద్రబాబు కొత్త నాటకానికి తెరలేపుతున్నారు. పెట్రోలు, డీజీల్‌ ధరలను కేంద్ర ప్రభుత్వమే పెంచింది. సెస్‌ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాను కూడా ఇవ్వడం లేదని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దుయ్యబట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement