AP Minister RK Roja Satirical Comments On Nara Lokesh Yuvagalam Padayatra - Sakshi
Sakshi News home page

అతను లోకేష్‌ కాదు.. పులకేష్‌: మంత్రి రోజా కౌంటర్‌

Jan 28 2023 2:36 PM | Updated on Jan 28 2023 3:42 PM

Minister RK Roja Satirical Comments On Nara Lokesh - Sakshi

సాక్షి, చిత్తూరు: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌పై మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్‌ అడుగుపెడితే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని రోజా కీలక కామెంట్స్‌ చేశారు. 

కాగా, మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్‌ పెద్ద ఐరన్‌ లెగ్‌. లోకేష్‌ ఎక్కడ అడుగుపెడితే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. తారకరత్న అస్వస్థతకు గురైతే చంద్రబాబు, లోకేష్‌ పట్టించుకోలేదు. లోకేష్‌ అడుగుపెట్టాడు.. రాజమండ్రి పుష్కరాల్లో జనం చనిపోయారు. లోకేష్‌ పాదయాత్ర పోస్టర్‌ రిలీజ్‌ చేస్తే మరకొందరు చనిపోయారు. లోకేష్‌ పాదయాత్ర చేపట్టాడు తారకరత్న అస్వస్థతకు గురయ్యాడు. లోకేష్‌ తొలిరోజే తడబడ్డాడు.. అతను లోకేష్‌ కాదు.. పులకేష్‌ అన్నారు. 

తండ్రి చంద్రబాబు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి తీసుకుని లోకేష్‌ ఏం చేశారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మహిళలను కించపరిచే తండ్రి, కొడుకులు.. మహిళల గురించే మాట్లాడే అర్హత లేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలనలో మహిళలకు భద్రత పెరిగింది. మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అని కామెంట్స్‌ చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement