Minister RK Roja Comments On Chandrababu And Nara Lokesh - Sakshi
Sakshi News home page

బోగస్‌ బాబు.. బోగస్ సర్వేలు.. చంద్రబాబుపై మండిపడ్డ రోజా

Jul 14 2022 9:45 AM | Updated on Jul 14 2022 11:44 AM

Minister RK Roja Comments On Chandrababu And Nara Lokesh - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం విఐపీ దర్శన సమయంలో మంత్రి రోజా, నటి  రవళి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. అనంతరం ఆలయం అర్చకులు ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలు అందచేసారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి రోజా చంద్రబాబుపై ఘాటుగా విమర్శలు చేశారు.


చదవండి: విభేదాలతో సై’కిల్’.. టీడీపీలో కుంపట్ల కుమ్ములాట 

బోగస్ సర్వేలు చేయించే చంద్రబాబుని అందరు బోగస్ బాబుగా పిలుస్తున్నారని అన్నారు. పది రోజులకి ముందు సీఎం అయినా మహారాష్ట్ర సీఎంకు టాప్ 5 ర్యాంకు, మూడు సంవత్సరాలుగా అన్ని పథకాలను అమలు చేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్‌కి అట్టడుగు ర్యాంకు ఇవ్వడంపై రోజా మండిపడ్డారు. చంద్రబాబు, నారా లోకేష్‌కి చిన్న మెదడు చిట్లిపోయిందని, త్వరలోనే మానసిక వైకల్య కేంద్రంలో చంద్రబాబు చేర్పించాలని మంత్రి రోజా నిప్పులు చెరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement