AP Minister RK Roja Comments On Chandrababu Naidu - Sakshi
Sakshi News home page

చంద్రబాబు, అచ్చెన్నా, బాలకృష్ణకు మంత్రి రోజా సవాల్‌

Mar 28 2023 2:54 PM | Updated on Mar 28 2023 3:22 PM

Minister Rk Roja Comments On Chandrababu - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో రాష్ట్రం ఎంతో పురోగతి చెందిందని మంత్రి ఆర్కే రోజా అన్నారు.

సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో రాష్ట్రం ఎంతో పురోగతి చెందిందని మంత్రి ఆర్కే రోజా అన్నారు. సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామిని మంగళవారం.. మంత్రి దర్శించుకున్నారు. ఆమెకు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి త్రినాథరావు స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకొని, స్వామి వారి అంతరాలయంలో మంత్రి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింహాచల దేవస్థానం కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ప్రసాదం స్కీం పవర్ పాయింట్‌ను మంత్రి పరిశీలించారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యేలు, మంత్రులతో సీఎం జగన్‌ ఓ కటుంబంలా పనిచేస్తారన్నారు. 45 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచి బాధ్యతాయుతంగా పని చేస్తున్నామన్నారు. విశాఖ, చిత్తూరు, అనంతపురంలో పోటీ చేసి చంద్రబాబు, అచ్చెన్నా, బాలకృష్ణ గెలవాలని మంత్రి రోజా సవాల్‌ విసిరారు. సింహాచల దేవస్థానంలో ప్రతి భక్తునికి ఉపయోగపడే విధంగా కాటేజీలు నిర్మాణానికి పెద్దపీట వేశామన్నారు.
చదవండి: ‘సీఎం జగన్‌కు అడ్డంకులు సృష్టించడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు’

Advertisement
 
Advertisement
Advertisement