AP: Minister Peddireddy Ramachandra Reddy Comments On Chandrababu - Sakshi
Sakshi News home page

AP: అలాంటివేమి జరగలేదు.. చంద్రబాబు చౌకబారు ఆరోపణలు’

Jul 14 2022 11:42 AM | Updated on Jul 14 2022 12:39 PM

Minister Peddireddy Ramachandra Reddy Comments On Chandrababu - Sakshi

రుషికొండలో ఎలాంటి అక్రమాలు జరగలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

సాక్షి, తిరుపతి: మైనింగ్ అక్రమాలు అంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. రుషికొండలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. గురువారం ఆయన తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై టీడీపీ దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. కుప్పం మైనింగ్ విషయంలోనూ ఇలాంటి అబద్ధాలే ప్రచారం చేశారని.. అధికారులే స్వయంగా పర్యవేక్షించి అక్రమ మైనింగ్ జరగడం లేదని తేల్చారని మంత్రి వివరించారు. కుప్పంలో టీడీపీ నాయకులే రౌడీయిజం చేస్తున్నారని దుయ్యబట్టారు.
చదవండి: బోగస్‌ బాబు.. బోగస్ సర్వేలు.. చంద్రబాబుపై మండిపడ్డ రోజా 

‘‘గతంలో అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకున్నాం. టీడీపీ హయాంలోనే మైనింగ్‌లో అక్రమాలు జరిగాయి. ఎన్నో సంస్కరణలతో రాష్ట్ర ఆదాయాన్ని పెంచాం. పారదర్శకంగా ఇసుక టెండర్లు పిలిచాం. శాటిలైట్‌ సిస్టమ్‌ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. ఏపీ మైనింగ్ శాఖకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు లభించాయని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.

    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement