ఢిల్లీ లీడర్లకు కేసీఆర్‌ భయం 

Minister KTR Participates In Malakpet Road Show - Sakshi

హస్తినలోనూ తెలంగాణ జెండా పాతుతడని మోదీ, రాహుల్‌కు గుబులు 

అందుకే కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడించేందుకు కలసి కుట్రలు 

అడ్డగోలుగా పైసలతో లీడర్లను కొంటున్నరు.. కానీ ప్రజల్ని కొనలేరు 

మతవిద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీకి గుణపాఠం చెప్పండి 

సుస్థిర ప్రభుత్వం కోసం బీఆర్‌ఎస్‌ను గెలిపించండి 

భిక్కనూరు, గోషామహాల్, మలక్‌పేట రోడ్‌ షోలలో కేటీఆర్‌  

సాక్షి, కామారెడ్డి/అబిడ్స్‌/మలక్‌పేట: ‘కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి కాంగనే ఉత్తిగ ఊకుండడు... ఢిల్లీలోనూ తెలంగాణ జెండా పాతుతడని ఢిల్లీ లీడర్లు మోదీ, రాహుల్‌ గాం«దీకి భయం పట్టుకుంది. అందుకే కామారెడ్డిలో కేసీఆర్‌ను ఖతంజెయ్యాలని (ఓడగొట్టాలని) ఇద్దరూ కలసి కుట్రలుజేస్తున్నరు. అడ్డగోలుగా పైసలు గుమ్మరించి లీడర్లను కొంటున్నరు. ఎందరిని కొంటరో కొననీ.. మిమ్మల్ని (ప్రజలను) మాత్రం కొనలేరు. ప్రజల మద్దతుతో కేసీఆర్‌ భారీ విజయం సాధిస్తడు’అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కె. తారక రామారావు జోస్యం చెప్పారు. మతవిద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీకి గుణపాఠం చెప్పాలని... సుస్థిర ప్రభుత్వం కోసం మరోసారి బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలని కోరారు. శనివారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంతోపాటు హైదరాబాద్‌లోని గోషామహల్, మలక్‌పేట నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన రోడ్‌ షోలలో మంత్రి కేటీఆర్‌ ప్రసంగించారు. 

గల్ఫ్‌ వలసపోయినోళ్లకు ప్రత్యేక ప్యాకేజీ... 
బతుకుదెరువు కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన వారి కోసం ప్రత్యేక ప్యాకేజీ అమలు చేసి ఆదుకుంటామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. డిసెంబర్‌ 3 తరువాత మూడోసారి అధికారం చేపట్టగానే కొత్త పథకాలు, కొత్త రేషన్‌ కార్డులు, కొత్త పింఛన్లు అందిస్తామని చెప్పారు. రూ. 400కే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తామని, అసైన్డ్‌ భూములపై పూర్తి హక్కులు పట్టాదారులకే ఇస్తామని స్పష్టం చేశారు. 

రేవంత్‌ కొడంగల్‌లో చెల్లని రూపాయి... 
‘2018 ఎన్నికల్లో కొడంగల్‌ ప్రజలు రేవంత్‌రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించిండ్రు. అసుంటి రేవంత్‌రెడ్డి కామారెడ్డికి వచ్చి సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తే ఇక్కడి ప్రజలు ఊకుంటరా.. తుక్కుతుక్కు ఓడగొడుతరు. అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతదా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. 

కేసీఆర్‌ పాలనలో కరువు, కర్ఫ్యూ లేదు.. 
హైదరాబాద్‌ పాతబస్తీలో గతంలో కర్ఫ్యూలతో బంద్‌లు జరిగేవని... కానీ కేసీఆర్‌ పాలనలో కరువు, కర్ఫ్యూలు లేవని మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. హిందూ, ముస్లింలు అన్నదన్నముల మాదిరిగా కలసి జీవిస్తున్నారన్నారు. అభివృద్ధే కులం, సంక్షేమమే మతంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. మలక్‌పేట అంటే ఒకప్పుడు టీవీ టవర్‌ గుర్తుకు వచ్చేదని... ఇప్పుడు ఐటీ టవర్‌ ఐకాన్‌గా నిలుస్తోందన్నారు. ధూల్‌పేట కళాకారులను చైనాకు పంపి అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇచ్చి ఉపాది కల్పిస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. బీజేపీ కేవలం మతాల పేరుతోనే రాజకీయాలు చేస్తుంది తప్ప అభివృద్ధి చేయడం ఆ పారీ్టకి సాధ్యంకాదన్నారు. 

ఇందిరమ్మ రాజ్యమంటే ఆకలి రాజ్యం.. 
‘కాంగ్రెసోళ్లు ఇందిరమ్మ రాజ్యం తెస్తమంటున్నరు. నాకు తెలిసి ఇందిరమ్మ రాజ్యమంటే ఆకలి రాజ్యం.గంజినీళ్లు దొరకని రాజ్యం. అసుంటి దరిద్రపుగొట్టు, దుర్మార్గపు పాలన మనకు అవసరమా’అని కేటీఆర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పాలనలో 29 లక్షల మందికి రూ. 200 చొప్పున పింఛన్‌ ఇచ్చేవారని, తాము అధికారంలోకి వచ్చాక 46 లక్షల మందికి రూ. 2 వేల చొప్పున ఇస్తున్నామని, మూడోసారి అధికారంలోకి రాగానే పింఛన్‌ మొత్తాన్ని రూ. 5 వేలకు పెంచుకుంటూ వెళ్తామని చెప్పారు. 16 రాష్ట్రాల్లో బీడీ కారి్మకులు ఉన్నా, ఎక్కడా జీవనభృతి ఇవ్వలేదని, మనం మాత్రమే ఇస్తున్నామని, బీడీ కార్మికుల పింఛన్‌ అర్హత కటాఫ్‌ తేదీని 2023కు పెంచి మిగిలిపోయిన వారందరికీ ఇస్తామని తెలిపారు. సన్నబియ్యం అందించడంతోపాటు 18 ఏళ్లు నిండిన మహిళలకు రూ. 3 వేల సాయం అందిస్తామని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

26-11-2023
Nov 26, 2023, 15:10 IST
తెలంగాణను బలవంతంగా ఏపీలో కలిపిందే కాంగ్రెస్‌. కాంగ్రెస్‌ ఏకపక్ష నిర్ణయంతో 58 ఏళ్లు గోస పడ్డాం.
26-11-2023
Nov 26, 2023, 14:59 IST
సాక్షి, కరీంనగర్‌: 'ఏ దేశమేగినా ఎక్కడున్నా ఓటే తమ అభిమతమని చాటుతున్నారీ యువత. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగమే తమ నినాదమని ధీమాగా...
26-11-2023
Nov 26, 2023, 14:48 IST
హైదరాబాద్‌: తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ప్రధాని మోదీ అన్నారు. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సచివాలయానికి వెళ్లని...
26-11-2023
Nov 26, 2023, 14:42 IST
సాక్షి, సంగారెడ్డి: ‘కేసీఆర్‌జీ నువ్వు కాళేశ్వరంలో ఎంత దోపిడీ చేశావో చెప్పు. మీరు తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల దోపిడీ చేశావని కాంగ్రెస్...
26-11-2023
Nov 26, 2023, 14:14 IST
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ప్రధాన పార్టీలు.. 
26-11-2023
Nov 26, 2023, 14:14 IST
ప్రధాన పార్టీలేమో వ్యూహాత్మక ఎత్తుగడల నడుమ కీలక నేతల పోరు తెలంగాణ ఎన్నికలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి.
26-11-2023
Nov 26, 2023, 13:35 IST
కరీంనగర్‌ అర్బన్‌: మన దేశంలో కొన్నిచోట్ల 60 శాతం ఓటింగ్‌ జరిగితే గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఉంది. అందుకే దీన్ని...
26-11-2023
Nov 26, 2023, 12:11 IST
‘తమ్మీ మీ ఊళ్లో గాలి ఎటు వీస్తుంది? ఓటర్లు ఏమనుకుంటున్నరు? మనమీద ఎవైరైనా నారాజ్‌గా ఉన్నార? ఉంటే చెప్పు. వాళ్లను...
26-11-2023
Nov 26, 2023, 12:01 IST
భద్రాచలం అర్బన్‌: శాసనసభ ఎన్నికల సమరంలో డబ్బు కీలకపాత్ర పాత్ర పోషిస్తుందన్నది ఎవరూ కాదనలేని అంశం! అయితే, ఎన్నికల నియమావళి...
26-11-2023
Nov 26, 2023, 11:52 IST
 సత్తుపల్లి: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనూ జలగం వెంగళరావు పరిచయం అక్కరలేని పేరు. ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, హోంమంత్రి, జిల్లా...
26-11-2023
Nov 26, 2023, 07:44 IST
సాక్షి, ఆదిలాబాద్‌: ‘బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే.. ఈ రెండు పార్టీలకు మూడో దోస్తు ఎంఐఎం.. ఈ ఎన్ని కల్లో ఆ...
26-11-2023
Nov 26, 2023, 04:50 IST
సాక్షి, హైదరాబాద్‌: రాజకీయ నిరుద్యోగంతో బాధ పడుతున్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ యువతను రెచ్చగొట్టి చిచ్చు పెట్టాలని చూస్తున్నారని...
26-11-2023
Nov 26, 2023, 04:47 IST
ఆమనగల్లు, బన్సీలాల్‌పేట్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని ఓడించేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం ఒక్కటయ్యాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు....
26-11-2023
Nov 26, 2023, 04:37 IST
సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల ప్రచారంతోపాటు పోలింగ్‌ ముగిసేదాకా పార్టీ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని.. క్షేత్రస్థాయిలో ఒక్కో ఓటును ఒడిసిపట్టాలని బీఆర్‌ఎస్‌...
26-11-2023
Nov 26, 2023, 04:30 IST
సాక్షి, కామారెడ్డి/సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ అంతటా బీజేపీ గాలి వీస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాష్ట్ర ప్రజలు...
25-11-2023
Nov 25, 2023, 18:12 IST
సాక్షి, హైదరాబాద్‌ : ముగ్గురు అమ్మాయిలు. ముగ్గురూ నాన్న కుట్టిలే. నాన్నతో ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉన్నవారే. ఇపుడు నాన్నలు లేరు....
25-11-2023
Nov 25, 2023, 17:17 IST
సాక్షి,తుక్కుగూడ : కాంగ్రెస్ గెలిస్తే  బీఆర్‌ఎస్‌కు కార్బన్ పేపర్ లాంటి సర్కారే వస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు....
25-11-2023
Nov 25, 2023, 15:01 IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నారైలు తమ ప్రత్యేకతను చాటుకునే యత్నం చేస్తున్నారు. ఇప్పటికే గీతారెడ్డి, చెన్నమనేని రమేష్‌ లాంటి ఎన్నారై బ్యాక్‌డ్రాప్‌ ఉన్న...
25-11-2023
Nov 25, 2023, 14:05 IST
తెలంగాణలో రకరకాల మాఫియాలతో..  ఆ వచ్చే డబ్బంతా కేసీఆర్‌ ఇంటికే చేరింది. 
25-11-2023
Nov 25, 2023, 13:56 IST
సాక్షి, రాజ‌న్న సిరిసిల్ల‌/వేములవాడ: 'అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గర పడుతోంది. గ్రామాల్లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల... 

Read also in:
Back to Top