కాంగ్రెస్‌ నేస్తం కాదు..  భస్మాసుర హస్తం 

Minister KTR Aggressive Comments On Congress Party - Sakshi

రేవంత్, కోమటిరెడ్డి కరెంట్‌ వైర్లు పట్టుకుంటే.. రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని యాదగిరిగుట్ట, వలిగొండ, మిర్యాలగూడలో కేటీఆర్‌ రోడ్‌షో 

సాక్షి, యాదాద్రి, మిర్యాలగూడ, ఎల్‌బీనగర్‌/మన్సూరాబాద్‌: ‘కాంగ్రెస్‌ నేస్తం కాదు.. భస్మాసుర హస్తం’అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని 55 సంవత్సరాలు పరిపాలించి ఇప్పుడు ఒక్కసారి అవకాశం ఇవ్వమనడం సిగ్గుచేటని పేర్కొన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, వలి గొండ, నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రోడ్‌షో, కార్నర్‌ మీటింగ్‌లలో ఆయన ప్రసంగించారు.

తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ రావడం లేదంటున్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. కరెంట్‌ వైర్లు పట్టుకుంటే రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో సాగుకు అర్ధరాత్రి కరెంట్‌ ఇస్తే భార్యాపిల్లలను వదిలి పాములు, తేళ్లు, విష పురుగుల భయంతో పొలానికి మోటారు పెట్టడాని కి వెళ్లేవారని చెప్పారు.

చీకట్లో కరెంట్‌ షాక్‌కు గురై అనేక మంది రైతన్నలు ప్రాణాలు వదిలారని.. ఆ రైతుల ఉసురు తగిలే కాంగ్రెస్‌ పార్టీ అడ్రస్‌ గల్లంతైందన్నారు. వారి హయాంలో విత్తనాలు, ఎరువు ల కోసం రైతులు గంటల కొద్దీ పడిగాపులు కాయా ల్సి వచ్చేదని.. కానీ, స్వరాష్ట్రంలో రైతులకు అలాంటి అవస్థలు లేవన్నారు. తెలంగాణ అభివృద్ధితో పాటు సుభిక్షంగా ఉండాలంటే మరోసారి కేసీఆర్‌ను గెలిపించాలని కేటీఆర్‌ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 

రాహుల్‌గాందీకి వ్యవసాయం తెలియదు.. 
కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాందీకి వ్యవసాయం గురించి తెలియదని, పబ్బులు క్లబ్బులు మాత్రమే తెలుసన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైతే పింఛన్‌ రూ.4 వేలు ఇస్తామని చెప్పుకునే కాంగ్రెస్‌ నేతలు వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అందరూ ప్రియమైన ప్రధాని అని అంటున్నారు.. కానీ ప్రధాని మోదీ పిరమైన ప్రధానిగా మారారని ఎద్దేవా చేశారు. బీజేపికి ఓట్లు వేస్తే మూసీలో వేసినట్లే అన్నారు.  

టీఎస్‌పీఎస్‌సీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తాం 
టీఎస్‌పీఎస్‌సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి జాబ్‌ కేలెండర్‌ను విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎల్‌బీనగర్‌ అభ్యర్థి దేవిరెడ్డి సుదీర్‌రెడ్డికి మద్దతుగా ఎల్‌బీనగర్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి రోడ్‌ షో నిర్వహించారు. మన్సూరాబాద్, బీఎస్‌రెడ్డినగర్‌ చౌరస్తాలలో మంత్రి మాట్లాడుతూ, టీఎస్‌పీఎస్‌సీలోని తప్పులను సవరించి శాశ్వత ప్రతిపాదికన ఉద్యోగులను నియమిస్తామన్నారు.

కొత్తపేట ప్రూట్‌మార్కెట్‌ స్థలంలో అధునాతన వెయ్యి పడకల టిమ్స్‌ హాస్పిటల్‌ను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేతలు అధికారంలోకి వస్తామని కలలు కంటూ సీఎం కుర్చీ కోసం 11 మంది కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి అన్యాయం అయ్యారని, మళ్లీ అలాంటి తప్పు చేయవద్దని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్‌ తదితరులు పాల్గొన్నారు. 

ప్రతిపక్షాలపై కేటీఆర్‌ పరుష పదజాలం
ప్రతిపక్ష పార్టీల నేతలపై కేటీఆర్‌ నిప్పులు చెరి గారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో రోడ్‌షో సందర్భంగా.. ‘ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎక్కడ, ఇంటికో ఉద్యోగం ఎక్కడ, కేజీ టు పీజీ ఉచిత విద్య ఎక్కడ’అని కొందరు యువకులు ప్లకార్డులు పట్టుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన కేటీఆర్‌ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘55 ఏళ్లు పరిపాలించిన వాళ్లు ఏం పీకారు. అడగడానికి ఇజ్జత్‌ లేదు, మానం లేదు. ఆ సన్నాసులు అడుగుతున్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావాలని, వీపు పగులగొట్టే వాళ్లు లేకనా’అని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

21-11-2023
Nov 21, 2023, 04:15 IST
నర్సాపూర్‌ /పరకాల/బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి కేకల రాజ్యం కాదని, అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే రాజ్యమని...
21-11-2023
Nov 21, 2023, 04:11 IST
గజ్వేల్‌/దుబ్బాకటౌన్‌: బీడీ కట్టల మీద, పాల మీద జీఎస్‌టీ వేసి, గ్యాస్‌ ధరలు పెంచి, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని...
21-11-2023
Nov 21, 2023, 04:07 IST
జనగామ/కోరుట్ల/మెట్‌పల్లి/మల్లాపూర్‌ (హైదరాబాద్‌): బీఆర్‌ఎస్‌ సర్కారు పాలనలో మిషన్‌ పథకాలన్నీ కల్వకుంట్ల కుటుంబానికి కమీషన్ల స్కీంలుగా మారిపోయాయని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి...
20-11-2023
Nov 20, 2023, 16:13 IST
సాక్షి,నర్సాపూర్‌ : నర్సాపూర్ కాంగ్రెస్ నాయకులు నమ్మించి మోసం చేసి పార్టీలు మారారని, కార్యకర్తలు మాత్రం పార్టీ జెండా మోస్తూనే ఉన్నారని టీపీసీసీ...
20-11-2023
Nov 20, 2023, 15:48 IST
సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్‌ : కాంగ్రెస్‌ ధరణిని రద్దు చేసి దాని ప్లేస్‌లో భూమాత అనే స్కీమ్‌ తీసుకొస్తారట కాంగ్రెస్‌ వాళ్లు తెచ్చేది భూమాత...
20-11-2023
Nov 20, 2023, 13:53 IST
ఖమ్మంలో రెండు సామాజిక వర్గాలు ఏటువైపు చూస్తే వారికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి..
20-11-2023
Nov 20, 2023, 13:34 IST
సాక్షి, కామారెడ్డి: దశాబ్దాలుగా ఆయా నియోజకవర్గాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా పాతముఖాలే కనిపించేవి. గెలిచినా, ఓడినా వాళ్లే బరిలో ఉండేవారు....
20-11-2023
Nov 20, 2023, 13:19 IST
సిరిసిల్ల: అది సిరిసిల్ల జిల్లా కేంద్రం. సమయం అర్ధరాత్రి దాటింది. వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. పట్టణ వాసులు నిద్రపోతున్నారు. నేతకార్మికులు...
20-11-2023
Nov 20, 2023, 12:54 IST
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో మేడ్చల్‌ నియోజకవర్గం ఎంతో మంది ఉద్దండులను రాష్ట్రానికి అందించింది. మర్రి చెన్నారెడ్డి, దేవేందర్‌గౌడ్‌ వంటి రాజకీయ...
20-11-2023
Nov 20, 2023, 12:18 IST
నిర్మల్‌/ఖానాపూర్‌/సాక్షి, ఆసిఫాబాద్‌: ‘కుమురంభీమ్, రాంజీగోండు, సమ్మక్క–సారలమ్మ లాంటి వీరుల భూమి ఇది. జల్‌ జంగల్‌ జమీన్‌ కోసం పోరాడిన గడ్డ...
20-11-2023
Nov 20, 2023, 11:26 IST
రూపురేఖలు మార్చే ఎన్నికలివి.. ‘మిత్రులారా.. మొట్టమొదటగా ఈ ప్రాంత మాతా మాణికేశ్వరి అమ్మవారికి నమస్కరిస్తున్నా.. అభ్యర్థుల పేర్లు ఏదైతే చెప్పినప్పుడు హర్షధ్వానాలతో...
20-11-2023
Nov 20, 2023, 10:43 IST
నాగర్‌కర్నూల్‌/అలంపూర్‌/కొల్లాపూర్‌/కల్వకుర్తి రూరల్‌: కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఇస్తే కరెంట్‌ కష్టాలు తప్పవని, సంక్షేమ పథకాల అమలు ప్రశ్నార్థకమవుతాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల...
20-11-2023
Nov 20, 2023, 09:45 IST
జహీరాబాద్‌: గతంలో నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆరుగురిలో ముగ్గురికి మాత్రం మంత్రివర్గలో చోటు లభించింది. కాంగ్రెస్‌ హయాంలోనే ఎం.బాగారెడ్డి,...
20-11-2023
Nov 20, 2023, 09:14 IST
రాజకీయ పార్టీల్లో వలసల పరంపర కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నాటి నుంచి జిల్లాలో రాజకీయ పార్టీల్లో ఒక...
20-11-2023
Nov 20, 2023, 08:54 IST
హైదరాబాద్: తాజా ఎన్నికల్లో కొందరు నేతలు పోటీ చేయడం లేదు. అయినా అభ్యర్థులను మించి కష్టపడాల్సి వస్తోంది. ఇందుకు కారణం...
20-11-2023
Nov 20, 2023, 08:53 IST
నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్ర...
20-11-2023
Nov 20, 2023, 05:31 IST
ధర్మపురి/పెగడపల్లి/కాటారం: కాంగ్రెస్‌ మాటలు నమ్మి మోసపోవద్దని, బీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఎమ్మెల్సీ కవిత ప్రజలను కోరారు....
20-11-2023
Nov 20, 2023, 05:21 IST
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి సంస్థ మనుగడ సాగించాలంటే సీఎం కేసీఆర్‌ ఉండాలి..కేసీఆర్‌ ఉండాలంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌...
20-11-2023
Nov 20, 2023, 05:06 IST
సిద్దిపేటజోన్‌: పక్కనున్న కర్ణాటకలో ఐదు గ్యారంటీలను ప్రకటించిన రాహుల్, ప్రియాంకాగాంధీ పత్తా లేకుండాపోయారని, అక్కడ పరిస్థితి గందరగోళంగా మారిందని మంత్రి...
20-11-2023
Nov 20, 2023, 04:51 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/సాక్షి, నాగర్‌ కర్నూల్‌: కాంగ్రెస్‌ నాయకులు ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారని.. ఇందిరమ్మ పాలన అంటే ఆకలి చావులు, ప్రజలను...



 

Read also in:
Back to Top