‘చెల్లెల్ని చూసి నేర్చుకో’.. కేటీఆర్‌కు కొండా సురేఖ కౌంటర్‌ | Minister Konda Surekha Strong Counter To KTR | Sakshi
Sakshi News home page

‘చెల్లెల్ని చూసి నేర్చుకో’.. కేటీఆర్‌కు కొండా సురేఖ కౌంటర్‌

Feb 11 2025 5:05 PM | Updated on Feb 11 2025 5:54 PM

Minister Konda Surekha Strong Counter To KTR

సాక్షి, హైదరాబాద్‌ : సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు. రీ సర్వే చేయాలంటే.. కేటీఆర్, ఆయన కుటుంబం దరఖాస్తు చేసుకోవాలి. సర్వే అంటున్న కేటీఆర్.. చెల్లి కవితను చూసి నేర్చుకోవాలి. సర్వే, ప్రొఫార్మాలో ఎక్కడ తప్పులు జరిగాయో కేటీఆర్ చెప్పాలి. ఎమ్మెల్యేలలో అసంతృప్తి అనేది నాకు తెలీదు..నేను ఎవరిని ఎంకరేజ్ చేయడంలేదు.

దేవాదాయ శాఖలో ఉద్యోగుల కొరత ఉంది.అడ్మినిస్ట్రేషన్‌కు ఇబ్బంది అవుతుంది. రెవెన్యూ నుంచి ఉద్యోగులను తీసుకోవడం ఇప్పుడు కొత్తేమీ కాదు. లీగల్ లిటికేషన్స్‌లో లేని వాటిని మొదటి దశలో సర్వే చేయాలని అదేశించాం. రాష్ట్రంలో ఎక్కడెక్కడ కుంభాభిషేకాలు చేయాలో లిస్ట్ సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చాం.

కాళేశ్వరంలో కుంభాభిషేకం చేయక 42 ఏళ్లు అవుతుంది. ఫారెస్ట్‌లలో సర్వేయర్ల ప్రొటెక్షన్‌పై ఎలాంటి ఫిర్యాదులు లేవు. గత పదేళ్ళలో దేవాదాయ శాఖ భూములు కబ్జా అయ్యాయి. గత ప్రభుత్వంలో నాయకులే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈటెల రాజేందర్‌పై త్వరలోనే విచారణ జరుగుతుంది. బీసీ రిజర్వేషన్ల సర్వేతో మాకు పేరు వస్తుందనే విమర్శలు. బీసీ రిజర్వేషన్ల వ్యాల్యూ ఇప్పుడే అర్థం కాదు. ఉద్యోగాలు,ఇతర అంశాల్లో బీసీలకు న్యాయం జరుగుతుంది’ అని హామీ ఇచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement