టీడీపీ ఆరిపోయే దీపం: మంత్రి జోగి రమేష్‌ | Minister Jogi Ramesh Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

టీడీపీ ఆరిపోయే దీపం: మంత్రి జోగి రమేష్‌

Jun 11 2022 1:48 PM | Updated on Jun 11 2022 1:55 PM

Minister Jogi Ramesh Comments On Chandrababu - Sakshi

వైఎస్సార్‌సీపీ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదిగిందని.. టీడీపీ ఆరిపోయే దీపం లాంటిందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ అన్నారు.

సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్‌సీపీ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదిగిందని.. టీడీపీ ఆరిపోయే దీపం లాంటిందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ అన్నారు. శనివారం ఆయన ఏఎస్‌పేట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ కోసం కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
చదవండి: తాకట్టు పెట్టిన పుస్తెల తాడు ఇంటికి తెస్తానన్నావ్‌.. కానీ నువ్వు చేసిందేమిటి?’

బద్వేల్‌ తరహాలోనే ఆత్మకూరు పరిస్థితి ఉంటుందని.. పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. పోటీ నుంచి తప్పుకున్నా లోపాయికారి మద్దతివ్వడం టీడీపీకి అలవాటు. జన్మభూమి కమిటీతో చంద్రబాబు రాష్ట్రాన్ని కర్మభూమిగా మార్చాడు. గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం దిశగా రాష్ట్రం పయనిస్తోందని మంత్రి జోగి రమేష్‌ అన్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement