టీఆర్‌ఎస్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు | MIM MLA Mumtaz Ahmed Khan Slams KCR And TRS | Sakshi
Sakshi News home page

మేం తలుచుకుంటే రెండు నెలల్లో గెంటేస్తాం..

Nov 23 2020 10:07 AM | Updated on Nov 23 2020 10:17 AM

MIM MLA Mumtaz Ahmed Khan Slams KCR And TRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘మేం తలుచుకుంటే గ్రేటర్‌ ఎన్నికల్లోనే కాదు.. రాబోయే రెండు నెలల్లో మొత్తమే గెంటేస్తాం.. మజ్లిస్‌ పార్టీ నిన్న కళ్లు తెరవలేదు.. మంత్రి కేటీఆర్‌ ఒక చిలుక.. నిన్న కళ్లు తెరిచాడేమో ఎక్కువ మాట్లాడుతున్నారు. రాజకీయాలు మాకు కొత్త కాదు. మాతో పెట్టుకుంటే కనుమరుగవుతారు. గతంలో ఎంతో మంది సమాధి అయ్యారు’ అంటూ చార్మినార్‌ ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై, కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు.

ఆదివారం చార్మినార్‌లో మాజీ కార్పొరేటర్‌ మహ్మద్‌ గౌస్‌తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తమకు సీట్లో కూర్చో బెట్టడం తెలుసు.. కింద పడేయడం తెలుసునని సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఓవైసీ ఎప్పుడూ చెబుతుండేవారన్నారు. తమతో కలిసి ఉంటే బావుంటుందని.. గతంలో తమతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన వారి పరిస్థితి ఏమైందో అందరికి తెలుసన్నారు. ఏది పడితే అది అంటుంటే ఊరుకోబోమని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement