‘వరుణ్‌ విషయంలో బీజేపీని సవాల్‌ చేయలేను’ | Maneka Gandhi Says Can't Challenge Party's Decision Over Varun Gandhi Ticket | Sakshi
Sakshi News home page

‘వరుణ్‌ విషయంలో బీజేపీని సవాల్‌ చేయలేను’

May 11 2024 12:20 PM | Updated on May 11 2024 12:27 PM

Maneka Gandhi Says Can't Challenge Party's Decision Over Varun Gandhi Ticket

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకుపోతుంది. 400 స్థానాలే లక్ష్యంగా ప్రచారంలో వేగం పెంచింది. ఇక.. ఈసారి కొంతమంది సిట్టింగ్‌లకు బీజేపీ టికెట్ నిరాకరించిన విషయం తెలిసిందే. అందులో ‍ ప్రముఖంగా వరుణ్‌గాంధీకి ఫిలిభీత్‌ స్థానంలో బీజేపీ అధిష్టానం టికెట్‌  ఇవ్వకపోవటంపై చర్చ జరిగింది. అయితే తాజాగా శనివారం వరణ్‌ గాంధీకి టికెట్‌ కేటాయించకపోవటంపై ఆయన తల్లి మేనకా గాంధీ స్పందించారు. ఆమె ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు.

‘‘వరుణ్‌ గాంధీ విషయంలో బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని తాను సవాల్‌ చేయలేను. నేను పార్టీకి నిర్ణయానికి గౌరవిస్తాను. అలాగే వరుణ్‌ గాంధీపై నాకు అపారమైన నమ్మకం, విశ్వాస ఉంది. నా కుమారుడు వరుణ్‌ గాంధీ చాలా సమర్థవంతుడు, తన స్థాయికి తగినట్లు కృషి చేస్తాడు. కొంతమంది ఎంపీ కావాలనుకుంటారు. కానీ, కొంతమంది ఎంపీ పదవికి  ఎంపిక కాకుండానే ప్రజల కోసం రాజకీయనాయకులు అవుతారు. జీవితం మన కోసం  ఏం నిక్షిప్తం చేసి ఉందో తెలియదు’’ అని మేనకా గాంధీ అన్నారు. 

ఇక.. మేనకా గాంధీ ఉత్తర ప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌ పార్లమెంట్‌ నుంచి బరిలో ఉన్నారు.  ప్రజలకు సేవ చేయటం కోసం మరోసారి బీజేపీ టికెట్‌ కేటాయించటంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఎన్ని ఓట్లను సాధిస్తార్న ప్రశ్నకు స్పందిస్తూ.. వీలైనన్ని ఎక్కువ ఓట్లు సంపాదించటం కోసం ప్రతిరోజూ  ప్రయత్నం చేస్తూ ఉంటానని తెలిపారు.

వరుణ్‌ గాంధీ రెండుసార్లు ఫిలిభీత్‌ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. బీజేపీ, ప్రభుత్వ విధానాలకు వరుణ్‌ గాంధీ బహిరంగంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనకు బీజేపీ ఫిలిభీత్‌ టికెట్ నిరారించినట్లు ప్రచారం జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement