‘కొడంగల్‌లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా?’ | Mahmood Ali Slams Revanth Reddy | Sakshi
Sakshi News home page

‘కొడంగల్‌లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా?’

Nov 5 2023 5:06 PM | Updated on Nov 5 2023 5:14 PM

Mahmood Ali Slams Revanth Reddy - Sakshi

సాక్షి, కామారెడ్డి జిల్లా: తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై హోంమంత్రి మహమూద్‌ అలీ ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌ ముందు రేవంత్‌రెడ్డి ఓ బచ్చా అని.. చిన్న పిల్లాడు అంటూ విమర్శించారు. రేవంత్‌రెడ్డి పక్కా ఆరెస్సెస్‌ మనిషి అని, కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న బీజేపీ కోవర్టు అంటూ మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని శుభం కన్వెన్షన్‌ హాలులో జరిగిన మైనార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మహమూద్‌ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్‌ అలీ మాట్లాడుతూ..  ‘ దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌ రాష్ట్రం..

నంబర్‌వన్‌ సీఎం కేసీఆర్‌.కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి ఓ బచ్చా.. చిన్న పిల్లాడు. రేవంత్ రెడ్డి పక్కా ఆరెస్సెస్ మనిషి.. కాంగ్రెస్ కండువా వేసుకున్న బీజేపీ కోవర్టు.కొడంగల్‌లో  చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా?, సీఎం కేసీఆర్ స్వయంగా కామారెడ్డి రావడం ఇక్కడి ప్రజల అదృష్టం. మైనార్టీ సంక్షేమం కేవలం తెలంగాణలోనే అయింది. మైనార్టీల అభివృద్ధి కేవలం కేసీఆర్ తోనే సాధ్యం. కామారెడ్డిలో కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి’ అని విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement