
పవన్ కల్యాణ్‌ను సైకో అంటూ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి దుమ్మెత్తిపోశారు. సీఎం జగన్‌ను విమర్శించే హక్కు పవన్‌కు లేదని, ప్రభుత్వ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు కనిపించడం లేదా? అంటూ ఆమె ధ్వజమెత్తారు.
సాక్షి, విశాఖపట్నం: పవన్ కల్యాణ్‌ను సైకో అంటూ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి మండిపడ్డారు. సీఎం జగన్‌ను విమర్శించే హక్కు పవన్‌కు లేదని, ప్రభుత్వ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు కనిపించడం లేదా? అంటూ ఆమె ధ్వజమెత్తారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..
చంద్రబాబు నీచుడు.. ఎన్టీఆర్ కుటుంబాన్ని చీల్చాడు. ఇప్పుడు జగన్ కుటుంబాన్ని చీల్చుతున్నారు. సునీత చంద్రబాబు చేతిలో సునీత కీలుబొమ్మగా మారారు. నీ తండ్రిని హత్య చేసినవారిని వదిలి సీఎం జగన్‌ను విమర్శిస్తున్నారు. నీ తండ్రిని ఓడించిన టీడీపీ చేతుల్లో పడ్డావు సునీత’’ అంటూ లక్ష్మీపార్వతి హెచ్చరించారు.
తాడేపల్లి గూడెం సభ చూసిన తర్వాత టీడీపీ ఎంత బలహీనంగా ఉందో కనిపించింది. పవన్ మీకు ఆలోచన లేదా?. 75 ఏళ్ల ముసలి చంద్రబాబుపై అరవై కేసులు వున్నాయి.ఎలా నమ్మావ్ పవన్. నీ బలహీనతతో కాపు సామాజిక వర్గాన్ని అవమాన పరిచావు. నీ బలహీనతను చంద్రబాబు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. నీ బలహీనత ఏంటో అర్థం కావడం లేదు. ఎప్పుడైనా కాపు సామాజిక వర్గానికి మేలు చేశావా?. మీ బాస్ రెండు ఎకరాల నుంచి 6 లక్షల కోట్లకు ఎలా ఎదిగారు?’’ అంటూ లక్ష్మీపార్వతి ప్రశ్నించారు.
‘‘పవన్ కల్యాణ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి. నీచుడైన చంద్రబాబు ఉచ్చులో పడ్డాడు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏపీకి ప్రమాదం. గత టీడీపీ పాలనలో ఒక్క అభివృద్ధి పని జరిగిందా?. అప్పుడు ఎన్టీఆర్‌పై దుష్ప్రచా రం చేసిన పచ్చ మీడియా ఇప్పుడు జగన్‌పై గట్టింది. ప్రతి కుటుంబంలో చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు నడుపుతున్నారు. షర్మిల గురించి అందరికీ తెలుసు. తండ్రిని మోసం చేసిన పార్టీతో జత కలిసింది. మంచి కుటుంబంలో పుట్టిన షర్మిల, సునీత.. ఎందుకు చంద్రబాబు ఉచ్చులో పడ్డారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు నైజం బయట పడుతుంది’’ అని లక్ష్మీపార్వతీ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: సునీత ముసుగు నేటితో తొలగిపోయింది: సజ్జల