
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తొమ్మిదన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం అని కేటీఆర్ తెలిపారు. దేశంలోనే అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని హెచ్చరించారు.
కాగా, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..
‘తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం
దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం
పగలూ రాత్రి తేడా లేకుండా..
రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన..
తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం..
విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం..
అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోం..
అందుకే గణాంకాలతో సహా..
వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించేందుకు..
అప్పులు కాదు..
తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు..
తెలంగాణ భవన్ వేదికగా
23వ తేదీన (శనివారం)
ఉదయం 11 గంటలకు
“ స్వేద పత్రం ”
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్..’అంటూ పోస్టు పెట్టారు.
తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం
— KTR (@KTRBRS) December 22, 2023
దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం
పగలూ రాత్రి తేడా లేకుండా..
రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన..
తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం..
విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం..
అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే…