
హైదరాబాద్: రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కారుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనతోనే తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని ధ్వజమెత్తారు. వరుసగా నెలలు తెలంగాణ మైనస్ ద్రవ్యోల్పణమే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పతనం అయ్యిందనడానికి నిదర్శమన్నారు.
ఈ మేరకు కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. వరుస రెండు నెలల పాటు తెలంగాణ మైనస్ ద్రవ్యోల్పణంలోకి వెళ్లిపోవడం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇదే తొలిసారి అని మండిపడ్డారు. దేశంలో ఇలాంటి పరిస్థితి వచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే కేటీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ సర్కారు ఆర్థిక కార్యకలాపాలను పూర్తిగా అణచివేసిందని, అదే సమయంలో ఉద్యోగాలను సృష్టించడంలో విఫలమైందన్నారు. ఒక శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థను అవగాహన లేని పాలనతో నాశనం చేయడం చూస్తే బాధగా ఉందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలన నిరాశజనకంగా కనిపిస్తోందన్నారు కేటీఆర్. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, రాష్ట్రాభివృద్ధి తిరోగమనంలో పయనిస్తోందన్నారు.
For the first time since its formation, Telangana has slipped into deflation for 2 straight months - June & July
What’s worth highlighting is that Telangana is the ONLY state in India in this situation
Deflation is not a sign of prosperity. It means people are limiting… pic.twitter.com/AAk5ZGCNTl— KTR (@KTRBRS) August 14, 2025