
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఏ క్షణమైనా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. ఇందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నెల 30వ తేదీ లోపు ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేయాలని ఎస్‌ఈసీని తెలంగాణ సర్కార్ కోరిన సంగతి తెలిసిందే.
రిజర్వేషన్ల నివేదికలు అందగానే స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఇవాళ(శనివారం) గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. కోర్టులో కేసులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఎలక్షన్ కమిషన్.. కోర్టు ఏమైనా అదేశాలు ఇస్తే దాన్ని బట్టి ఎస్‌ఈసీ తదుపరి చర్యలు తీసుకునే అవకాశముంది. ఎలక్షన్ నిర్వహణకు ఎలక్షన్ కమిషన్.. ఎక్సైజ్, పోలీస్, పంచాయతీ రాజ్ శాఖల నివేదికలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదటగా ఎంపీటీసీ, తర్వాత సర్పంచ్ ఎన్నికలకు కసరత్తు మొదలపెట్టనుంది.