
దసరా, సద్దుల బతుకమ్మ వేడుకల కోసం నగరవాసులు ఆదివారం సొంతూళ్లకు భారీగా తరలివెళ్లారు. దీంతో నగరం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు, బస్సులు, ప్రైవేట్ వాహనాలు ప్రయాణికుల రద్దీతో కిక్కిరిశాయి.

తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సోమవారమే సద్దుల బతుకమ్మ వేడుకలు జరగనున్న దృష్ట్యా చాలామంది ఆదివారం సొంత ఊరికి పయనమయ్యారు.

వరదలు తగ్గుముఖం పట్టడంతో మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచి ఆర్టీసీ సేవలను పునరుద్ధరించారు.

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే ఈసారి వందకు పైగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్ స్టేషన్‌లో కొనసాగుతున్న పునరభివృద్ధి పనుల రీత్యా చాలావరకు చర్లపల్లి, నాంపల్లి, కాచిగూడ, మల్కాజిగిరి, హైటెక్‌సిటీ, లింగంపల్లి, తదితర స్టేషన్‌ల నుంచి రైళ్లను నడుపుతున్నారు.












