అంచనాలు పెంచి ప్రజాధనం లూటీ: కేటీఆర్‌ | BRS Leader KTR fires at CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

అంచనాలు పెంచి ప్రజాధనం లూటీ: కేటీఆర్‌

Sep 9 2025 5:48 AM | Updated on Sep 9 2025 6:13 AM

BRS Leader KTR fires at CM Revanth Reddy

రూ.1,100 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు రూ.7 వేల కోట్లు ఎందుకు?

జనం సొమ్మును దోచుకునేందుకే గోదావరి జలాల తరలింపు పనులు 

సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ ఫైర్‌ 

ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నట్లు వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కొండపోచమ్మ సాగర్‌ నుంచి హైదరాబాద్‌కు గోదావరి జలాలను తరలించేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గతంలో రూ.1,100 కోట్లతో అంచనాలను రూపొందించగా.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దాన్ని రూ.7,390 కోట్లకు పెంచి ప్రజాధనాన్ని లూటీ చేస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీ రామారావు ఆరోపించారు. రూ.16 వేల కోట్లతో పూర్తయ్యే మూసీ సుందరీకరణ ప్రాజెక్టును రూ.లక్షన్నర కోట్లకు పెంచడాన్ని బీఆర్‌ఎస్‌ అడ్డుకుందని.. దీంతో రూటు మార్చిన రేవంత్‌రెడ్డి విడతల వారీగా జనం సొమ్మును దోచుకునేందుకే గోదావరి జలాల తరలింపు పనులు మొదలు పెట్టారని ధ్వజమెత్తారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 

న్యాయ పోరాటం చేస్తాం.. 
‘సము‘ద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మ సాగర్‌ నుంచి గోదావరి జలాలను గ్రావిటీ ద్వారా రావల్‌కోల్‌ చెరువుకు, అక్కడి నుంచి 540 మీటర్ల ఎత్తున ఉన్న గండిపేటకు తరలించడం ద్వారా మూసీతో అనుసంధానం చేసే వీలుంది. అయినా 560 మీటర్ల ఎత్తులో ఉన్న మల్లన్నసాగర్‌ నుంచి నీటిని తరలించేలా ప్రతిపాదనలు మార్చి నీటి శుద్ధి కేంద్రాలు, పంప్‌ హౌస్‌లు ఎవరి లాభం కోసం కడుతున్నారో ప్రభుత్వం చెప్పాలి. కాంట్రాక్టర్లకు దోచిపెట్టి కమీషన్లు దండుకునేందుకే సీఎం ఈ పనులు చేపడుతున్నారా? హైదరాబాద్‌కు గోదా వరి జలాల తరలింపులో అవినీతిపై న్యాయ పోరాటం చేస్తాం..’అని కేటీఆర్‌ చెప్పారు. 

కుర్చీ కాపాడుకునేందుకే.. 
‘కాళేశ్వరం ప్రాజెక్టును విఫల పథకంగా ప్రచారం చేసిన రేవంత్, కాంగ్రెస్‌ నేతలు ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద సీబీఐ విచారణకు ఆదేశించిన రేవంత్‌రెడ్డి.. అదే ప్రాజెక్టు ఆధారంగా నిర్మించిన మల్లన్నసాగర్, మూసీ నదుల అనుసంధానం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అయితే కాళేశ్వరంపై చెప్పిన అబద్ధాలను కప్పి పుచ్చుకునేందుకు మల్లన్నసాగర్‌కు బదులుగా గండిపేట దగ్గర శంకుస్థాపన చేశారు. 

కేంద్ర ప్రభుత్వం బ్లాక్‌ లిస్టు చేసిన కాంట్రాక్టు కంపెనీకి. రేవంత్‌ తాను నిర్వహిస్తున్న మున్సిపల్‌ శాఖలో అంతర్భాగమైన హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ బోర్డు నుంచి రూ.7 వేల కోట్ల విలువైన కాంట్రాక్టును ఇచ్చారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వేల కోట్లు దోచుకుని ఢిల్లీకి మూటలు పంపి, వాటాలు పంచి తన సీఎం కురీ్చని కాపాడుకునేందుకే ఇదంతా చేస్తున్నారు..’అని మాజీమంత్రి ఆరోపించారు. 

యూరియా కొరతపై స్పందించని బీజేపీ, కాంగ్రెస్‌ 
‘ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇద్దరూ మంచి అభ్యర్థులే. అయితే మేము రాష్ట్రంలో ప్రధాన సమస్యగా ఉన్న యూరియా కొరతపై బీజేపీతో పాటు కాంగ్రెస్‌ కూడా స్పందించక పోవడంతో ఉప రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాం. నోటా ఉంటే దానికే వేసేవాళ్లం కానీ, ఆ అవకాశం లేనందున ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నాం.  

కవిత విషయంలో అవసరమైన నిర్ణయం తీసుకున్నాం.. 
ఎమ్మెల్సీ కవిత విషయంలో పార్టీ వేదికపై, అంతర్గతంగా చర్చించి అవసరమైన నిర్ణయం తీసుకున్నాం. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరినట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఓ టీవీ చర్చలో అంగీకరించి అప్రూవర్‌గా మారాడు. నేరాంగీకారం తర్వాత ఇంకా విచారణ ఎందుకు? వేటు వేయాల్సిందే. 

మహారాష్ట్ర పోలీసులు ఫ్యాక్టరీ కార్మీకులుగా అవతారం ఎత్తి తెలంగాణలో రూ.12 వేల కోట్లు విలువైన డ్రగ్స్‌ను పట్టుకుంటే తెలంగాణ పోలీసులు, ఇంటెలిజెన్స్, ఈగిల్, హైడ్రాలు ఏం చేస్తున్నాయి? డ్రగ్స్‌ వ్యవహారంలో సీఎం రేవంత్‌కు ముడుపులు ముట్టినందునే తెలంగాణ పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించారా?..’అని కేటీఆర్‌ ప్రశ్నించారు. మాజీ మంత్రులు జి.జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్‌ కవిత, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ సమావేశంలో పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement