AP: Kodali Nani Serious Comments On TDP Chandrababu Naidu - Sakshi
Sakshi News home page

Kodali Nani: : చంద్రబాబు, రామోజీరావుపై మంత్రి కొడాలి నాని ఫైర్‌.. తప్పుదోవ పట్టిస్తున్నారని ఆ‍గ్రహం

Mar 14 2022 12:28 PM | Updated on Mar 14 2022 1:06 PM

Kodali Nani Serious Comments On TDP Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి: అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబుపై పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు ఎన్టీఆర్‌ మద్య నిషేధం అమలు చేస్తే, దానికి తూట్లు పొడిచి చంద్రబాబు తన పాలనలో ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు పెంచారని అన్నారు. ఎక్కడ పడితే అక్కడ బెల్ట్‌షాప్‌లు ఏర్పాటు చేయించి, మద్యం అమ్మకాలు పెంచి, అంతులేని అవినీతికి పాల్పడ్డాడని విమర్శించారు. ఈరోజు కూడా ఎల్లో మీడియా, ఈనాడు జంగారెడ్డిగూడెం ఘటనను తప్పు పట్టిస్తూ, ప్రజల్లో అపోహలు కల్పించే విధంగా కథనం రాసిందని మండిపడ్డారు. రామోజీరావు ఆ స్థాయికి దిగజారాడని ఆరోపించారు. చంద్రబాబు శవ రాజకీయం చేస్తున్నారు. ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేయాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement