టీడీపీని లోకేష్ కొల్లేరులో కలపడం ఖాయం: కొడాలి నాని

Kodali Nani Satirical Comments On Lokesh babu In krishna District - Sakshi

సాక్షి, కృష్ణా : ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేరుస్తున్నారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. రైతు భరోసా రూపంలో పెట్టుబడి సాయంగా 13,500 ఇస్తున్నారని తెలిపారు. సీజన్ ముగియక మునుపే వర్షాల కారణంగా ఏర్పడిన పంట నష్టానికి ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్నారని వెల్లడించారు. ఈ మేరకు జిల్లాలో మంత్రి మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాలో రైతులకు పంట నష్టనికి 7 కోట్ల 20 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాట్లు చేయగా దానికి అదనంగా 600 కోట్లు ఇచ్చి గిట్టుబాటు ధర కల్పించినట్లు పేర్కొన్నారు. కేంద్రం ఇస్తున్న దానిని దాచుకునే ఉద్దేశం సీఎం జగన్‌కు లేదని, ఆర్బీకే ద్వారా నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నారని కొనియాడారు. చదవండి: స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు

రైతాంగం కోసం పని చేసే ప్రభుత్వం తమదని, దివంగత వైఎస్‌ రాజశేఖర రెడ్డిబాటలో జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలన అందిస్తున్నారన్నారు. రైతుల ఆశీస్సులు సీఎం జగన్‌కు ఉన్నాయని, సంక్షేమ పథకాలు పేదలకు చేరాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని తెలిపారు.. వైఎస్‌ జగన్‌ నిర్ణయంతో 2 లక్షల మంది గిరిజనులకు లబ్ధి చేకూరుంది. పథకాల పబ్లిసిటీ పిచ్బిలో చంద్రబాబు ఉండేవాడని విమర్శించారు. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మోరిగిన తంతుగా లోకేష్ తీరు ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. వరదలు వానలు తగ్గాక కొంప కొల్లేరు అయిందంటూ పర్యటనలు చేస్తున్నాడని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో కొత్త కమీటీ వేసి లోకేష్‌ను జనంలోకి వదిలి పార్టీని పైకి తీసుకు రావాలని చంద్రబాబు ఆరాటపడుతున్నాడని కొడాలి నాని అన్నారు. చదవండి: ఆ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకుంటాం: మంత్రి నాని

‘లోకేష్ ట్రాక్టర్ తీసుకెళ్లి బోదులో పడేసే వాడు. ట్రాక్టర్ తోలటం రాని పప్పుకు తెలుగు దేశం పార్టీ అప్ప చెబితే పార్టీని కూడా తీసుకెళ్లి కొల్లేరులో ముంచుతాడు. తెలివి గలవారు ఉంటే  ముందు  ఎక్కవద్దు. ఆ పార్టీ నుంచి దిగిపోండి. కొల్లేరులో నీరు ఉందని తెలియని అజ్ఞాని లోకేష్. వరి చేనుకు చేపల చెరువు తేడా తెలియని మేధావి లోకేష్. 2016 సెప్టెంబర్‌లో చిదంబరంతో  చీకటి ఒప్పందం చేసుకున్న వ్యక్తి చంద్రబాబు. విభజన హోదా, పోలవరం నిధులు,విభజన హామీలు అన్నింటిని తాకట్టు పెట్టిన చంద్రబాబును ప్రజలు 23 సీట్లు పరిమితం చేశారు. చంద్రబాబు చచ్చిన శవంతో సమానం. బుద్ది, జ్ఞానం లేదు.  పిల్లనిచ్చిన మామనే వెన్ను పోటు పొడిచాడు. చంద్రబాబుకు డబ్బా కొట్టేందుకు రాధాకృష్ణ, రామోజీ రావు, బీఆర్ నాయుడు ఉన్నారు. 2024లో టీడీపీని లోకేష్ కొల్లేరులో కలపడం ఖాయం.’ అంటూ టీడీపీ నిప్పులు చెరిగారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top