ఆ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకుంటాం: మంత్రి నాని

కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని
సాక్షి, అమరావతి: కరోనాతో మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. విజయవాడలో కరోనాతో మరణించిన ఆర్టీసీ ఉద్యోగులు శుభాకరరావు, ఎస్కే లాల్ కుటుంబాలను రాష్ట్ర మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, రవాణా, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు పరామర్శించారు. వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున చెక్కును అందించారు.
రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. కోవిడ్–19 సమయంలో ఆర్టీసీ కార్మికులు విశేష సేవలందించారని కొనియాడారు. ఆయనేమన్నారంటే.. ఆర్టీసీలో 4,700 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. 73 మంది మరణించారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్టీసీ నుంచి వచ్చే బకాయిలు, ఇతరత్రా కాకుండా సంస్థ ఉద్యోగులు ఒక రోజు వేతనం ఇస్తున్నారు.ఆ 73 మంది కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున అందిస్తాం. (వాళ్లుండాల్సింది ఫీల్డ్‌లోనే.. సచివాలయాల్లో కాదు)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి