తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధిస్తాం: కిషన్‌రెడ్డి | Kishan Reddy Says BJP Will Win Majority Seats Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధిస్తాం: కిషన్‌రెడ్డి

Mar 2 2024 1:49 PM | Updated on Mar 2 2024 3:23 PM

Kishan Reddy Says BJP Will Win Majority Seats Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీజేపీ మెజార్టీ సీట్లలో విజయం సాధిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జీ.కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన అభివృద్ధి భారతావనికి మోదీ గ్యారంటీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం  కిషన్‌ రెడ్డి మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టో కోసం ప్రజల నుంచి సలహాలు తీసుకుంటామని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లకు పైగా గెలుస్తుందని తెలిపారు. విజయ సంకల్ప యాత్రతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నిండిందని చెప్పారు.

మోదీ నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి వస్తామని చెప్పారు. ఈ ఎన్నికలకు ‘మరోసారి మోదీ సర్కారు‘ అనేది మా పార్టీ నినాదమని తెలిపారు. బీజేపీకి ప్రజలు ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నామని అన్నారు. ప్రధాని మోదీ 4న అదిలాబాద్, 5న సంగారెడ్డిలో పర్యటిస్తారని తెలిపారు. ఆదిలాబాద్‌లో రూ. 6,697 కోట్లు, సంగారెడ్డిలో రూ. 9,021 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement