సింపతీ కోసమే కేజ్రీవాల్‌ అరెస్ట్‌ | Kejriwal Timed His Own Arrest : Bansuri Swaraj | Sakshi
Sakshi News home page

సింపతీ కోసమే కేజ్రీవాల్‌ అరెస్ట్‌

May 10 2024 2:52 PM | Updated on May 10 2024 3:13 PM

Kejriwal Timed His Own Arrest : Bansuri Swaraj

ఎన్నికల్లో సింపతి పొందేందుకే ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌  జైలుకెళ్లారని అయ్యారని బీజేపీ న్యూఢిల్లీ లోక్‌సభ అభ్యర్ధి బన్సూరీ స్వరాజ్‌ అన్నారు.

కేజ్రీవాల్‌ తన వ్యూహంలో భాగంగా ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు పంపిన తొమ్మిది సమన్లపై స్పందించ లేదన్నారు. కాబట్టే దర్యాప్తు సంస్థలు కేజ్రీవాల్‌ను కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌కు తీసుకెళ్లాయని అన్నారు.

ఈ సారి దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం 7 లోక్‌సభ స్థానాల్ని కైవసం చేసేలా బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా బీజేపీ గెలుపు గుర్రాల్ని బరిలోకి దించింది. ​కాగా, బన్సూరీ స్వరాజ్‌ న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మరోవైపు ఆప్‌- కాంగ్రెస్‌ ఒప్పందంలో భాగంగా అదే స్థానం నుంచి ఆప్‌ నేత సోమనాథ్‌ భారతి పోటీ చేస్తున్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement