దేశంలో పేదరికం తగ్గినా ఉచిత రేషన్‌ ఎందుకు? | Why India Continues Providing Free Ration Despite Low Poverty Rates? PM Economic Advisory Council Member Explains The Reason, Read Story Inside | Sakshi
Sakshi News home page

దేశంలో పేదరికం తగ్గినా ఉచిత రేషన్‌ ఎందుకు?

Nov 9 2026 1:46 PM | Updated on Nov 9 2026 1:55 PM

Why India Gives Free ration to People Despite low Poverty Rate Explains

భారతదేశంలో పేదరికం గణనీయంగా తగ్గి 3.9 శాతానికి పడిపోయినప్పటికీ దేశంలోని సుమారు 80 కోట్ల మంది ప్రజలకు ప్రభుత్వం ఉచిత రషన్ పంపిణీ పథకాన్ని ఎందుకు కొనసాగిస్తోందనే అంశంపై ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యురాలు షమికా రవి వివరణ ఇచ్చారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు తమ పౌరులకు సామాజిక భద్రత అందించడం అవసరమని ఆమె నొక్కిచెప్పారు.

నిజమైన లబ్ధిదారులు ఎంతమంది?

80 కోట్ల మందికి ఈ పథకానికి అర్హత ఉన్నప్పటికీ వినియోగదారుల వ్యయ సర్వే గణాంకాల ప్రకారం అందరూ దీన్ని వినియోగించుకోవడం లేదని ఆమె స్పష్టం చేశారు. వాస్తవానికి సుమారు 55 నుంచి 56 కోట్ల మంది మాత్రమే ఈ ఉచిత ధాన్యం ప్రయోజనాన్ని పొందుతున్నారని తెలిపారు. పారిశ్రామికంగా పురోగమిస్తున్న దేశాలు, జీ-7 దేశాల తరహాలోనే భారత్ కూడా తన ప్రజలకు ఆర్థిక భద్రతను ఇస్తోందని పేర్కొన్నారు.

ఆహారపు అలవాట్లలో మార్పులు

ఉచిత రషన్ ద్వారా ఆదా అవుతున్న నిధులను ప్రజలు ఇతర పౌష్టికాహారంపై వెచ్చిస్తున్నట్లు షమికా రవి వెల్లడించారు. దీనివల్ల ప్రజల రోజువారీ ఆహారంలో పాలు, పండ్లు, గుడ్లు, చేపలు, మాంసం వంటి పోషకాలు చేరి, వారి ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చాయని డేటా విశ్లేషించింది. గత పన్నెండు సంవత్సరాలతో పోలిస్తే అన్ని వర్గాల ప్రజల్లోనూ తలసరి గోధుమ, బియ్యం వినియోగం సుమారు 2 కిలోల వరకు తగ్గిందని, బదులుగా ప్రజలు మరింత వైవిధ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్నారని ఆమె చెప్పారు.

నిల్వ వ్యయం కంటే పంపిణీయే మేలు

దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి వినియోగానికి మించి భారీగా పెరుగుతోందని షమికా గుర్తుచేశారు. ఈ అదనపు ధాన్యాన్ని గోదాముల్లో ఏళ్ల తరబడి నిల్వ చేయడం వల్ల ప్రభుత్వానికి భారీ ఎత్తున స్టోరేజ్ ఖర్చులు భారమవుతాయి. నిల్వ చేసేకంటే ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడమే మరింత పొదుపైన, ఆచరణాత్మకమైన మార్గమని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: ఎందుకో ఆ రైలు తొందరపడింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement