సమష్టి ప్రగతి కోసమే భారత్ కృషి | PM Modi At Bloomberg Forum Says India Reform Express Lifted 250 Million People Out Of Poverty While Advancing Global Welfare | Sakshi
Sakshi News home page

సమష్టి ప్రగతి కోసమే భారత్ కృషి

Oct 13 2026 11:20 AM | Updated on Oct 13 2026 12:04 PM

PM Modi at Bloomberg Forum Reform Express Powering 250M Out of Poverty

దేశంలో తొలిసారిగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ‘బ్లూమ్ బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్’ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ శ్రేయస్సు, సమష్టి ప్రగతి కోసమే భారత్ కృషి చేస్తోందని చెప్పారు. ఈ వేదికను ఏర్పాటు చేయడంపై నిర్వాహకులను అభినందిస్తూ.. సదస్సు నిర్వహణకు సరైన సమయం, సరైన స్థలాన్ని ఎంచుకున్నారని అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా ఉన్న భారతదేశాన్ని ఈ సందర్భంగా ఆయన ‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’ అని అభివర్ణించారు.

ఎనర్జీ సాధికారతతోనే ప్రగతి

సాంకేతిక పరిజ్ఞానం, డేటా, నూతన ఆవిష్కరణలు కేవలం కొద్దిమంది వర్గాలకే పరిమితం కాకూడదని ప్రధాని స్పష్టం చేశారు. డిజిటల్ విప్లవం లక్షలాది మంది సామాన్యులకు కొత్త అవకాశాలను కల్పించాలని ఆకాంక్షించారు. ‘సాంకేతికత కేవలం సౌకర్యం కాదు.. ఇక్కడి నుంచే ఎనర్జీ సాధికారత అనే నూతన ఆలోచన పుట్టింది. విద్యుత్తును అందరికీ అందుబాటులోకి తేవడమే కాకుండా దాన్ని ప్రజలు ఎలా సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నారనేది ఇక్కడ అత్యంత ముఖ్యం’ అని వివరించారు.

సరసమైన డేటా.. అందరికీ విద్యాఫలాలు

దేశంలో లభిస్తున్న చవకైన మొబైల్ డేటా కారణంగా చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా డిజిటల్ లెర్నింగ్ సులభంగా అందుబాటులోకి వచ్చిందని మోదీ తెలిపారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సామాన్యుడికి విద్య, వైద్యం, సంక్షేమ ఫలాలు చేరుతున్నాయని స్పష్టం చేశారు.

పేదరిక నిర్మూలన.. స్వయం సమృద్ధి

ప్రభుత్వాల పాత్రపై మోదీ స్పందిస్తూ..‘ప్రభుత్వానికి అధికారం ఉన్నప్పటికీ పౌరులను వ్యవస్థపై ఆధారపడేలా చేయడం దాని ఉద్దేశం కాకూడదు. ప్రజలను స్వయం సమర్థులుగా, శక్తివంతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం’ అని పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో సాధించిన ఆర్థిక ప్రోత్సాహకాల వల్ల ఏకంగా 25 కోట్ల (250 మిలియన్ల) మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని గణాంకాలతో వివరించారు.

ప్రపంచ సంక్షేమమే భారత్ లక్ష్యం

భారత్ చేపడుతున్న ఆర్థిక, పాలనా సంస్కరణలు వేగంగా ముందుకుసాగుతున్నాయని.. ‘భారత సంస్కరణల ఎక్స్‌ప్రెస్ శరవేగంగా దూసుకెళ్తోంది. ఈ సంస్కరణలు ఏదో ఒత్తిడి వల్లనో, బలవంతం వల్లనో చేపట్టినవి కావు.. ఇవి అపార నమ్మకంతో సాగుతున్నాయి’ అని తెలిపారు. ‘మేము ఎవరి పురోగతినో అడ్డుకొని లేదా ఇతరుల ఖర్చుపై ఎదగడం లేదు; ప్రపంచ శ్రేయస్సు, సమష్టి ప్రగతి కోసమే భారత్ కృషి చేస్తోంది’ అని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: పండగ ఆఫర్లు.. ఆన్‌లైన్‌ షాపింగ్‌.. బీ అలర్ట్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement