
సాక్షి, నంద్యాల: జిల్లాలో మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి అరాచకాలకు అంతులేకుండా పోతోంది. బనగానపల్లె వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కన్వీనర్‌పై మంత్రి అనుచరులు దాడికి పాల్పడ్డారు. మంత్రి కాంపౌండ్‌లోకి తీసుకెళ్లి కర్రలు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. బనగానపల్లె ఏరియా ఆసుపత్రిలో చంద్రమౌళి చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రికిలో చంద్రమౌళిని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బనగానపల్లె నియోజకవర్గంలో రౌడీ రాజ్యం నడుస్తుందని మండిపడ్డారు.
మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి రౌడీ మాదిరిగా వ్యవహరిస్తున్నాడంటూ కాటసాని దుయ్యబట్టారు. జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకోవడంలేదు. తాము ఫ్యాక్షన్‌కు చరమగీతం పాడి సాధారణ జీవితం సాగిస్తుంటే.. మాసిపోయిన ఫ్యాక్షన్‌ను మంత్రి బీసీ ప్రేరేపిస్తున్నారు. తమకు సహనం నశిస్తే మాత్రం ఎంతవరకైనా వెళ్తామంటూ కాటసాని రామిరెడ్డి హెచ్చరించారు.