నెల్లూరు, సాక్షి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిట్రిక్స్‌కు తెరలేపారని, మాటలు తప్ప, చేతలు శూన్యమని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. కోటి 47 లక్షల రేషన్ కార్డులు ఉంటే.. సగానికి సగం మందికి ఉచిత గ్యాస్ కట్ చేశారని ధ్వజమెత్తారు. ఆయన నెల్లూరులో శనివారం మీడియాతో మాట్లాడారు.
‘‘చంద్రబాబు మోసపురిత హామీలపై ఎమ్మెల్యేలే ఆగ్రహంతో ఉన్నారు. సూపర్ సిక్స్.. సూపర్ ప్లాఫ్‌గా మారింది. లా అండ్ ఆర్డర్‌లో చంద్రబాబు ఫెయిల్ అయ్యారు. నిత్యావసరాలు ధరలు పెంచేయ్యడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. పోర్టులు, హాస్పిటల్స్‌ను ప్రైవేటీకరణ చేస్తున్నారు.
వైఎస్ జగన్ కుటుంబం మీద బురద చళ్లుతున్నారు. ఫేక్ న్యూస్ ప్రచారం చెయ్యడంలో మంత్రి నారా లోకేష్ దిట్ట. వైఎస్ జగన్ కుటుంబం గురించి నీచంగా ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ ఆస్తి పంపకాలు కోర్టులో ఉండగా దాన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తూ.. రాజకీయ పబ్బం గడుకుంటున్నారు. రెండేళ్ల క్రితం విజయమ్మ కారు ప్రమాదానికి గురైతే.. అందులో కుట్ర కోణం ఉందని ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారు.
..ఎన్టీఆర్‌ను ఎవరు చంపేశారో.. ఎవరు వెన్నుపోటు పొడిచారో అందరికి తెలుసు.ఆయన చనిపోవడానికి కారకులు చంద్రబాబు కాదా?. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం ముగించుకుని వస్తుంటే ప్రమాదం జరిగింది.. అందులో కుట్ర కోణం ఉందా.?. హరికృష్ణ మరణం, జానకి రామ్ మృతిలో కుట్ర కోణం ఉందని మేము భావించాలా.?. తండ్రి మరణిస్తే.. తల కొరివి పెట్టడానికి మనసు రాని వ్యక్తి చంద్రబాబు.
.. చంద్రబాబుకి రూ. 1300 కోట్ల ఆస్తులు ఉంటే అందులో తమ్ముడికి, చెల్లెళ్లకి వాటా ఇచ్చారా? కుటుంబ విషయాల్లో తల దూర్చడం అవసరమా?. తనకి ప్రాణహాని ఉందని పవన్ కళ్యాణ్ ఇంట్లోని ఆడ బిడ్డ మీడియా ముందుకు వచ్చి చెప్పిన విషయం పవన్‌కు గుర్తులేదా?. 77 మంది మహిళలు అఘాయిత్యలకు గురైతే.. వాటి గురించి పవన్ కనీసం మాట్లాడలేదు. అలాంటి వ్యక్తి షర్మిలకి భద్రత కల్పిస్తామని చెప్పడం సిగ్గుచేటు.
..ఇసుక, మద్యం మాఫియాలకు కూటమి ఎమ్మెల్యేలే పాల్పడుతున్నారు. పవన్‌కు దమ్ముంటే వారిని తొక్కి పెట్టినార తియ్యాలి. పోలీసులు పెట్టే కేసులకు భయపడే వాళ్లు వైఎస్సార్‌సీపీలో ఎవ్వరూ లేరు. జగన్ పాలనకి చంద్రబాబు పాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. వైఎస్ జగన్ పాలన చూసి చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలి. కుటుంబాల మీద దుష్ప్రచారాలు చేస్తే.. మేం కూడా అలాగే వ్యవహరించాల్సి ఉంటుంది. అరెస్టులకు, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment