Palnadu: జనసేన నేతలను చితక్కొట్టిన టీడీపీ నాయకులు | Jana Sena And Tdp Leaders Incident In Palnadu District | Sakshi
Sakshi News home page

Palnadu: జనసేన నేతలను చితక్కొట్టిన టీడీపీ నాయకులు

Oct 24 2026 11:08 AM | Updated on Oct 24 2026 11:08 AM

Jana Sena And Tdp Leaders Incident In Palnadu District

సాక్షి, పల్నాడు జిల్లా: జనసేన నేతలను టీడీపీ నాయకులు చావబాదారు. బెల్లంకొండ మండలం గంగిరెడ్డిపాలెం ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన శ్రీనివాసరావుపై టీడీపీ నేతలు దాడి చేశారు. జనసేన అభ్యర్థిని నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డుకుని దాడి చేశారు. జనసేన అభ్యర్థికి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జనసేన అభ్యర్థిని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పరామర్శించారు.

గాదె వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. కూటమిలో మేము ఉన్నామని చెప్పుకోవడానికి సిగ్గుపడాలో అర్థం కావట్లేదన్నారు. గంగిరెడ్డిపాలెం ఎంపీటీసీ స్థానానికి మా అభ్యర్థి నామినేషన్ వేయడానికి వెళ్తే టీడీపీ నాయకులు దాడి చేశారు. నామినేషన్ సెంటర్ వద్ద టీడీపీ నాయకులు.. జనసేన అభ్యర్థి పై దాడి చేయడం దారుణం. జనసేన అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయకుండా దాడులు చేయడం హేయమైన చర్య. మహిళలు అని కూడా చూడకుండా దాడులు చేశారు.

టీడీపీ నాయకులతో కొట్టించుకోవడానికి మేము ఆ పార్టీతో పొత్తు కట్టలేదు. జనసేన అభ్యర్థిపై దాడికి ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి.. ఎవరు సమాధానం చెప్తారో చెప్పండి. జనసేన అభ్యర్థులను.. తెలుగుదేశం నాయకులు కొడుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకున్నారు. టీడీపీ నేతలు.. జనసేన నాయకుల్ని చంపుతామని బెదిరించారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వెంటనే స్పందించి దాడి చేసిన టీడీపీ నేతలతో జనసేన అభ్యర్థికి క్షమాపణ చెప్పించాలి వాళ్ల కాళ్లు పట్టించాలి. లేకపోతే ధర్నా చేస్తాం’’ అంటూ వెంకటేశ్వరరావు హెచ్చరించారు.

ఇదీ చదవండి: పౌర హక్కులపై నారా గొడ్డలి వేటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement