సాక్షి, అనంతగిరి: అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మైనింగ్ ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. అనంతగిరి మండలం పినకోట మైనింగ్ ప్రాంతంలో ఘటన జరిగింది. రోడ్డు పనుల కోసం తెచ్చిన వాహనంలో డీజిల్ నింపుతుండగా మంటలు చెలరేగి పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి టిప్పర్ ధ్వంసమైంది.
మృతుల్లో విశాఖకు చెందిన టీచర్ సునీత ఉన్నారు. డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ఘటనా స్థలంలో గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు పడి ఉన్నాయి. పలువురికి తీవ్ర గాయాలు కాగా.. వారిని ఆసుపత్రికి తరలించారు.
మరో ఘటనలో.. యలమంచిలి రైల్వేస్టేషన్‌లో గురువారం రాత్రి రైలెక్కిన వ్యక్తి తాడేపల్లిగూడెం వద్ద రైలు నుంచి జారిపడి దుర్మరణం పాలయ్యాడు. అనపర్తికి చెందిన గాలింకి కిరణ్‌బాబు(37) హైదరాబాద్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. అతని పిల్లలిద్దరూ యలమంచిలిలో చదువుతున్నారు. దీంతో యలమంచిలిలో ఉన్న సోదరి ఇంటికి గురువారం పిల్లలను తీసు కొచ్చి ఉంచి హైదరాబాద్ వెళ్లేందుకు యలమంచిలిలో రాయగడ నుంచి గుంటూరు వెళ్లే రైలు ఎక్కా డు.తాడేపల్లిగూడెం చేరుకున్న సమయంలో ప్రమాదవశాత్తూ రైలు నుంచి జారిపడ్డాడు.
అతని ఆచూకీ కోసం రైల్వే, పట్టణ పోలీసులు యలమంచిలి రైల్వేస్టేషన్లో సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజీని మీడియాకు విడుదల చేశారు. ఎరుపురంగు చొక్కా వేసుకుని ఉన్న కిరణ్‌బాబు ఇక్కడ రైల్వేస్టేషన్‌లో టికెట్ తీసుకున్న తర్వాత రైలెక్కడానికి వెళ్తున్నట్టు నమోదైంది.
ఇదీ చదవండి: ముంచుకొస్తున్న'అర్ణబ్' తుపాను


