దమ్ముంటే రాజీవ్‌ విగ్రహాన్ని టచ్‌ చేయ్‌: కేటీఆర్‌కు జగ్గారెడ్డి కౌంటర్‌ | Jagga Reddy Strong Counter To Ktr | Sakshi
Sakshi News home page

దమ్ముంటే రాజీవ్‌ విగ్రహాన్ని టచ్‌ చేయ్‌: కేటీఆర్‌కు జగ్గారెడ్డి కౌంటర్‌

Aug 20 2024 4:33 PM | Updated on Aug 20 2024 5:05 PM

Jagga Reddy Strong Counter To Ktr

రాజీవ్‌ గాంధీ విగ్రహం కూలగొడతామంటే మేము ఖాళీగా ఉన్నామా అంటూ కేటీఆర్‌కు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

సాక్షి, హైదరాబాద్‌: రాజీవ్‌ గాంధీ విగ్రహం కూలగొడతామంటే మేము ఖాళీగా ఉన్నామా అంటూ కేటీఆర్‌కు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్‌ చీఫ్‌ లిక్కర్‌ తాగినట్టుగా ప్రవర్తిసున్నారంటూ దుయ్యబట్టారు.

‘‘తల్లి గుండెల్లో ఉండాలి కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం లోపల పెడతామని రేవంత్ అన్నారు. రాజీవ్‌ విగ్రహం ముట్టుకుంటే చెప్పుతో కొడతానన్న సీఎం వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది’’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

పొలిటికల్‌ కోచింగ్ సెంటర్‌లో కేటీఆర్‌ ట్రైనింగ్ తీసుకుంటే మంచిది. కేటీఆర్‌కు ఎలాంటి విషయాలు మాట్లాడాలో తెలియడం లేదు. కేసీఆర్.. కేటీఆర్‌కు కోచింగ్ ఇప్పిస్తే మంచిది. పదేళ్ల కాలంలో జర్నలిస్టుల సమస్యల కోసం, ప్లాట్ల కోసం ఏనాడైనా అల్లం నారాయణ కోట్లాడిండా?’’ అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు.

చీప్ లిక్కర్ తాగావా..? జగ్గారెడ్డి కౌంటర్

Advertisement
 
Advertisement
Advertisement