సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడపలో రిగ్గింగ్ బట్టబయలైంది. జమ్మలమడుగు ఓటింగ్ శాతంలో విచిత్రాలు చోటు చేసుకున్నాయి. 4 గంటల్లోనే 60.92 శాతం పోలింగ్ జరిగింది. 11 గంటలవరకు 60.92 శాతం నమోదైనట్టు ఎస్‌ఈసీ ఎస్ ప్రకటించింది. మధ్యాహ్నం 1 గంటకు 61.86 శాతం పోలింగ్ నమోదైంది. మొదటి 4 గంటల్లో 60.92 శాతం నమోదైనట్టు చూపిన ఎస్‌ఈసీ.. తర్వాత రెండు గంటల్లో కేవలం 1 శాతం మాత్రమే నమోదైనట్టు వెల్లడించింది.
దీంతో ఎస్‌ఈసీ లెక్కలతో రిగ్గింగ్ బట్టబయలైంది. భారీ పోలింగ్‌పై ఎస్‌ఈసీ అధికారులకు అనుమానాలు కలగడంతో.. రిటర్నింగ్ అధికారితో ఎస్‌ఈసీ మాట్లాడారు. పులివెందులలో భారీగా రిగ్గింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఓటర్లు వెళ్లకుండానే 51.5 శాతం ఓటింగ్ జరిగినట్టు ఎస్‌ఈసీ ప్రకటించింది. పులివెందులలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై దాడులు చేసి.. బయటకు పంపేసిన టీడీపీ గుండాలు.. స్థానిక ఓటర్లను కూడా పోలింగ్ బూత్‌లకు రానివ్వడం లేదు.
అనంతపురంలో రిగ్గింగ్
అనంతపురం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ గూండాలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నేతృత్వంలో పోలింగ్ కేంద్రాలను ఆక్రమించిన టీడీపీ కూటమి నేతలు.. 39వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ నేతలపై కర్రలతో దాడులు చేశారు. 30వ డివిజన్‌లో టీడీపీ, బీజేపీ నేతల రిగ్గింగ్ చేశారు. పోలీసుల ప్రేక్షక పాత్ర వహించారు.
ఇదీ చదవండి: పులివెందుల ఆర్వో ఆఫీస్ వద్ద వైఎస్ జగన్ నిరసన


