గీత (ఫైల్) ఇంద్రాణి (ఫైల్)
చిత్తూరు: తిరుపత్తూరు జిల్లా వానియంబాడి సమీపంలోని కీరసముద్రం సమీపంలోని పుదూరులో నివశిస్తున్న దంపతులకు ఇప్పటికే ఇద్దరు అడ పిల్లలున్నారు. ఆ మహిళ మరోసారి గర్భవతి కాగా కడుపులో ఉన్న శిశువు కూడా ఆడ పిల్ల అని ఆమెకు తెలియవచ్చింది. ఈ విషయం తెలుసుకొని కలత చెందిన కుటుంబ సభ్యులు మరో కుమార్తె పుడుతుందేమో అని భయంతో అబార్షన్ చేయించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఆమె ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు పట్టణంలోని సంతపేటకు చెందిన గీత, ఇంద్రాని అనే ఇద్దరు మహిళలను సంప్రదించి వారిని తన ఇంటికి పిలిపించుకుంది.
శనివారం ఉదయం గర్భవతికి అక్రమంగా గర్భస్రావం చేయడానికి యత్నించారు. ఈ విషయం సమీపంలోని బంధువులకు తెలియడంతో వీటిపై తిరుపత్తూరు జిల్లా ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. వెంటనే ఆరోగ్యశాఖ అధికారి శివకుమార్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని తనిఖీ చేశారు. అప్పటికే వైద్యాధికారులు వాణియంబాడి పోలీసులకు కూడా సమాచారం అందజేయడంతో పోలీసులు అక్కడకు చేరుకొని విచారణ చేపట్టారు.
ఆ సమయంలో చిత్తూరుకు చెందిన గీత, ఇంద్రాని కలిసి ఎటువంటి వైద్యం చదవకుండానే అక్రమ అబార్షన్ చేసేందుకు ప్రయతి్నంచినట్లు తెలియ వచ్చింది. దీంతో పోలీసులు గీత, ఇంద్రానిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెల్లి విచారణ చేస్తున్నారు. మహిళ గర్భంలో ఉన్న శిశువు ఆడ పిల్ల అని చెప్పిన డాక్టర్ ఎవరు..? ఎటువంటి వైద్యం చదవకుండా ఇద్దరు మహిళలు అబార్షన్ చేసేందుకు యతి్నంచడంపై పోలీసులు సమగ్ర విచారణ చేస్తున్నారు. అదేవిధంగా చిత్తూరు నుంచి ఇద్దరు మహిళలను రప్పించి స్థానికంగా ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న మరో మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు.


